భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్..

-రాహుల్ తో కలిసి నడవనున్న లోక నాయకుడు

1
TMedia (Telugu News) :

భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్..

-రాహుల్ తో కలిసి నడవనున్న లోక నాయకుడు

టి మీడియా, డిసెంబర్19,హైదరాబాద్‌ : కాంగ్రెస్ ముఖ్య నేత, వాయనాడ్ ఎంపీ.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అప్రతిహితంగా కొనసాగుతోంది. ఈ యాత్రకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు వస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ. భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్.. రాహుల్ తో కలిసి నడవనున్న లోక నాయకుడు.కాంగ్రెస్ ముఖ్య నేత, వాయనాడ్ ఎంపీ.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర అప్రతిహితంగా కొనసాగుతోంది. ఈ యాత్రకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు వస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ ప్రముఖులు, సినీ రంగ సెలబ్రిటీలు భారీగా హాజరవుతున్నారు. ఈ క్రమంలో త్వరలోనే ప్రముఖ యాక్టర్ కమల్‌ హాసన్‌ భారత్ జోడో యాత్రలో పాల్గొనున్నారు. రాహుల్‌ గాంధీ ఆహ్వానం మేరకు వచ్చే వారంలో కమల్‌ హాసన్‌ ఈ యాత్రలో పాల్గొంటారని మక్కల్‌ నీది మయ్యం పార్టీ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్‌ 24 న ఈ యాత్రలో రాహుల్‌ తో కలిసి నడవనున్నారని తెలిపాయి. ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్ర డిసెంబర్‌ 24 న దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించనుంది.

Also Read : టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీనివాస కల్యాణం

సెప్టెంబరు 7న కన్యాకుమారిలో మొదలైన ‘భారత్‌ జోడో యాత్ర’ తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల మీదుగా ప్రస్తుతం రాజస్థాన్‌ లో కొనసాగుతోంది.మరోవైపు.. యాత్ర ప్రారంభమై 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో పార్టీ సీనియర్ లీడర్ జైరాం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ రాజస్థాన్ లో కొనసాగుతున్న యాత్ర.. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఎనిమిది రోజుల విరామం తీసుకోనుంది. అనంతరం బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్‌, హరియాణాలలో కొనసాగించనున్నారు. చివరగా జమ్మూకశ్మీర్‌లోకి ప్రవేశించడానికి ముందు వచ్చే నెలలో రాహుల్‌ పంజాబ్‌లో యాత్ర చేపట్టనున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube