తెలంగాణలో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోంది

ప్రధాని మోదీ

1
TMedia (Telugu News) :

తెలంగాణలో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోంది

– ప్రధాని మోదీ

టీ మీడియా, నవంబర్ 12, హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధిలో పాల్గొనడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. శనివారం నగరానికి వచ్చిన మోదీ తెలంగాణ బీజేపీ సభ లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ… రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ని జాతికి అంకితం చేయబోతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో కార్యకర్తలతో మాట్లాడాలని సంజయ్ కోరారని… ‘‘నేను కూడా మీలానే బీజేపీకి చెందిన చిన్న కార్యకర్తను’’ అని చెప్పుకొచ్చారు. తెలంగాణ కార్యకర్తలను చూసి స్ఫూర్తి పొందానని తెలిపారు. పీపుల్స్ ఫస్ట్.. అనేది బీజేపీ నినాదమన్నారు. ఇక్కడి కార్యకర్తలను బలమైన శక్తులు.. ఎవరికీ భయపడరని అన్నారు. తెలంగాణ పేరు చెప్పి పార్టీలు పెట్టినవారు పదవులు అనుభవిస్తున్నారని… ప్రజలకు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రధాని విమర్శించారు. తెలంగాణ లో కమల వికాసం స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. మునుగోడు ఎన్నికలో ప్రజలు బీజేపీకి ఒక భరోసా ఇచ్చారని… ఒక్క సీటు కోసం రాష్ట్ర ప్రభుత్వమంతా మునుగోడుకు పోయిందని వ్యాఖ్యలు చేశారు.

Also read : టీచ‌ర్ల‌ను నియ‌మించాల‌ని ర‌హ‌దారిపై బైఠాయించిన విద్యార్థులు

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని చూస్తుంటే తెలంగాణలో కమలం వికసించే రోజు దగ్గరలోనే ఉందని ధీమా వ్యక్తం చేశారు. మీరెంత గట్టిగా పోరాడారో ఉపఎన్నిక చూస్తుంటే అర్థమవుతోందన్నారు. తెలంగాణ సర్కార్‌కు రోజూ మోదీని తిట్టేందుకే సమయం సరిపోతోందన్నారు. మీరెన్ని తిట్లు తిట్టినా వాటిని అరిగించుకునే శక్తి తమలో ఉందన్నారు. తెలంగాణ సమాజాన్ని తిడితే మాత్రం అంతకంతా ప్రతీకారం తప్పదని మోదీ పేర్కొన్నారు. గతంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టేవన్నారు. కానీ ఆధార్ లింక్ చేసి అవినీతిని అడ్డుకున్నామన్నారు. రైతుల ఖాతాల్లోనే పీఎం కిసాన్ నిధులు వేస్తామన్నారు. నిధులు నేరుగా లబ్ధిదారులకే ఇస్తుండడంతో.. అవినీతిపరులకు కడుపు మండుతోందని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులుండదని తెలిపారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారేనని ప్రజలు చాటి చెప్పారని ప్రధాని మోదీ అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube