కంచర్ల లక్ష్మారెడ్డి మృతి : సీఎం కేసీఆర్‌ సంతాపం

కంచర్ల లక్ష్మారెడ్డి మృతి : సీఎం కేసీఆర్‌ సంతాపం

1
TMedia (Telugu News) :

కంచర్ల లక్ష్మారెడ్డి మృతి : సీఎం కేసీఆర్‌ సంతాపం

టీ మీడియా, నవంబర్ 3, హైదరాబాద్ : సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి(92) మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన లక్ష్మారెడ్డి నిరాడంబర జీవితం గడిపారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీనియర్ జర్నలిస్టు కంచర్ల లక్ష్మారెడ్డి(92) గురువారం తెల్లవారుజామున వరంగల్లులో కన్నుమూశారు. నల్లగొండ జిల్లా పరసాయపల్లెకు చెందిన కె.ఎల్‌.రెడ్డి కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Also Read : అద్దెకట్టటం లేదని ఏంపిడి వో కార్యాలయం కు తాళం

1950లో ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన కె.ఎల్.రెడ్డి సూర్యదేవర రాజ్యలక్ష్మి నిర్వహించిన తెలుగు దేశం రాజకీయ వారపత్రికతో తన సుదీర్ఘ జర్నలిజం ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభ పేరుతో వారపత్రికను, కాలేజీ విద్యార్థి పేరుతో మంత్లీని స్వయంగా నడిపారు. తెలంగాణ అక్షర యోధుడు పేరిట కె.ఎల్. రెడ్డి గురించి గోవిందరాజు చక్రధర్ ఆంధ్రభూమిలో రాసిన ప్రత్యేక కథనం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిని ఆకర్షించింది. ఆయన ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి తన సహాయనిధి నుంచి రూ.15 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube