స్వలాభం కోసమే కందాల పార్టీ మారారు
– అధికార మదంతో అక్రమ కేసులు బనాయింపు
– బీఆర్ఎస్ కు కాలం చెల్లే రోజులు వచ్చాయి
– కూసుమంచి పర్యటనలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి
టీ మీడియా,ఆగస్ట్ 7, కూసుమంచి: స్వలాభం కోసమే పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అధికార పార్టీలోకి చేరారని తెలంగాణ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు. కూసుమంచి మండల పర్యటనలో భాగంగా ముత్యాల గూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కందాల పోటీ చేసిన సమయంలో ఎవరైతే ఆయన గెలుపునకు కృషి చేశారో వారంతా ఆయనతో పాటు అధికార పార్టీలోకి చేరలేదనే కోపంతో వారికున్న అధికార మదాన్ని ప్రయోగించి వారిపై అక్రమ కేసులను పెట్టించి జైళ్లకు పంపించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ కు కాలం చెల్లే రోజులు వచ్చాయని మరో మూడు నెలల్లో ప్రజల ఆశీస్సులు, దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
also read :పాలేరు పై పొంగులేటి దృష్టి
అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గోడకు సున్నం కొట్టినంత సులువుగా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్న స్టంట్లు అన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు ఇంటికి సాగనంపడం ఖాయమన్నారు. అంతకుముందు పొంగులేటికి చేగొమ్మ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మలీదు సత్యనారాయణ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్నారు. అదేవిధంగా ముత్యాలగూడెంలో మంకెన వాసును పరామర్శించారు. పలు ప్రయివేటు కార్యక్రమాల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, రామసహాయం నరేష్ రెడ్డి, రాయల నాగేశ్వరరావు, సుడిగాలి కిషన్ రావు, కన్నెటి వెంకన్న, సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి, బజ్జూరి వెంకట రెడ్డి, బొలికొండ శ్రీను, బొలికొండ రామకృష్ణ, పుల్లా రెడ్డి, సురేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నర్రా సీతారాములు, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube