జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మం

జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మం

1
TMedia (Telugu News) :

జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మం

టీ మీడియా, నవంబర్ 17, హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 18 నుంచి కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యించారు. కంటి వెలుగు కార్య‌క్ర‌మం అమ‌లు తీరుపై సీఎం కేసీఆర్ గురువారం స‌మీక్షించారు. ప్ర‌జారోగ్యంపై వైద్య ఆరోగ్య శాఖ‌, ఇత‌ర మంత్రుల‌తో కేసీఆర్ స‌మావేశ‌మై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా కంటి వెలుగు కార్య‌క్ర‌మం మ‌ళ్లీ నిర్వ‌హించాల‌ని నిర్ణయం తీసుకున్నారు.

Also Read : రోడ్డు ప్రమాదం ..ఇద్దరు విద్యార్థులు మృతి

కంటి వెలుగు పథకాన్ని 2018, ఆగస్టు 15న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్ ప్రారంభించిన విషయం విదిత‌మే. అయితే.. ఈ పథకం ఐదు నెలల పాటు కొనసాగింది. కంటి వెలుగు కోసం ప్రభుత్వం రూ.106 కోట్లు ఖర్చు చేసింది కూడా. అయితే.. పథకంలో భాగంగా కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి కళ్లద్దాలతో పాటు మందులు కూడా పంపిణీ చేసింది ప్ర‌భుత్వం. ఈ కార్య‌క్ర‌మం అప్పుడు విజ‌య‌వంత‌మైంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube