కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయాలి
టీ మీడియా,జనవరి 11, కరకగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అత్యంత ప్రతిష్టాత్మక చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక అన్నారు.బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు.ఈ నెల 18 నుండి జరిగే కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో విస్తృతంగా ప్రచార చేసి,ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరుసద్వినియోగం చూసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీను,ప్రభుత్వ వైద్యాధికారి నరేష్,సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు,ప్రభుత్వ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.