-క్రైస్తవులకు దుస్తులు పంపిణీ
-కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక
టీ మీడియా,డిసెంబర్ 23,కరకగూడెం:
కుల,మత తేడా లేకుండా అందరూ క్రిస్మస్ వేడుకు ఘనంగా జరుపుకోవాలని కరకగూడెం ఎంపీపీ రేగా కాళిక అన్నారు.
గురువారం మండల కేంద్రంలోని కృపా సీయోను ప్రార్థన మందిరంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వచ్చిన కానుకలను క్రైస్తవులకు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ రేగా కాళిక మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతస్తులకు సీఎం కేసీఆర్ సముచిత గౌరవం కల్పిస్తున్నారని ఇందులో భాగంగానే క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఆనందగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను ఉచితంగా అందిస్తున్నదని చెప్పారు.
అన్ని ప్రాంతాల్లో ఉన్న పేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు కచ్చితంగా అందాలని అధికారులకు, మత పెద్దలను కోరారు.అలాగే యేసు ప్రభు కరుణమయుడని, ఆయన పయనించిన తీరు ఆదర్శనీయమని తెలిపారు.
క్రైస్తవులు సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని కోరారు.అదేవిధంగా ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని యేసు ప్రభువు బోధనలను పాటించాలని కోరారు.
ఓమిక్రాన్ రూపంలో కరోనా కేసులు నమోదవుతున్నాయని ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, శానిటైజ్ చేసుకుంటూ భౌతికదూరం పాటిస్తూ పండుగ జరుపుకోవాలని సూచించారు.మండలంలోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 72 కుటుంబాలకు కానుకలు అందజేశారు.అంతేకాకుండా కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం అతిథులకు ఫాస్టర్స్ శాలవలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విక్రంకుమార్,ఎంపీడీఓ శ్రీను,ట్రైనీ ఎస్సై గణేష్,కరకగూడెం సర్పంచ్ ఊకె రామనాథం,ఎంపిటిసి శైలజ,ఆర్ఐలు షేక్ హుస్సేన్, రాజు,రెవెన్యూ సిబ్బంది,పలు చర్చిల పాస్టర్స్ ఇర్ప పౌల్ తదితరులు పాల్గొన్నారు.