జాతీయ కరాటే చాంపియన్స్ కి ఆర్థిక సాయం

జాతీయ కరాటే చాంపియన్స్ కి ఆర్థిక సాయం

1
TMedia (Telugu News) :

జాతీయ కరాటే చాంపియన్స్ కి ఆర్థిక సాయం
టి మీడియా,జూన్15 ఖమ్మం‌: జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామానికి చెందిన కరాటే చాంపియన్స్ ఎళ్లిమళ్ల టీనా, బొల్లెద్దు హారిక మలేషియా లోని కౌలాలంపూర్ లో జరగనున్న ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ కు ఎంపికయ్యారు. టోర్నీకి వెళ్లేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ విషయన్ని నాయకన్ గూడేం గ్రామ సర్పంచ్ కాసాని సైదులు గారూ , డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ గారి దృష్టికి తీసుకెళ్లారు.

Also Read : జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

వెంటనే స్పందించిన ఇంటూరి శేఖర్ గారు ఇద్దరికి చెరొక ఐదువేలు ఆర్థిక సాయం అందజేశారు . ఈ యెక్క ఆర్థిక సహయం అందజేసిన ఇంటూరి శేఖర్ గారికి గ్రామ సర్పంచ్ కాసాని సైదులు గారూ, విద్యార్థిని తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube