క‌ర్ణి సేన చీఫ్ హంత‌కుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేయాలి

క‌ర్ణి సేన చీఫ్ హంత‌కుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేయాలి

0
TMedia (Telugu News) :

క‌ర్ణి సేన చీఫ్ హంత‌కుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేయాలి

– కాంగ్రెస్ నేత‌ ప్ర‌తాప్ సింగ్

టీ మీడియా, డిసెంబర్ 6, జైపూర్ : శ్రీ రాష్ట్రీయ రాజ్‌పుట్ క‌ర్ణిసేన చీఫ్ సుఖ్ధేవ్ సింగ్‌ను చంపిన‌ హంత‌కుల‌ను ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మార్చాల‌ని కాంగ్రెస్ నేత ప్ర‌తాప్ సింగ్ క‌చ‌రియ‌వ బుధ‌వారం డిమాండ్ చేశారు. ఇది తీవ్ర ప‌రిస్ధిత‌ని, సుఖ్ధేవ్ సింగ్ హంత‌కుల‌ను ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ట్టుబెట్టాల‌ని క‌చ‌రియ‌వ పేర్కొన్నారు. ప్ర‌జ‌లంతా శాంతితో సంయ‌మ‌నంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. కాగా, రాష్ట్రీయ రాజ్‌పుట్ క‌ర్ణి సేన చీఫ్ సుఖ్దేవ్ సింగ్ హ‌త్య‌కు నిర‌స‌న‌గా క‌ర్ణిసేన‌, ఇత‌ర గ్రూపులు బుధ‌వారం రాజ‌స్ధాన్ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. బంద్ పిలుపులో భాగంగా క‌ర్ణి సేన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేపట్టాయి. సుఖ్ధేవ్ సింగ్ హ‌త్యోదంతంపై న్యాయ విచార‌ణ జ‌రిపించాల‌ని క‌ర్ణి సేన కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేశారు. సుఖ్ధేవ్ సింగ్‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కోరామ‌ని, ఇలాంటి ఘ‌ట‌న జ‌రుగుతుంద‌నే ఆందోళ‌న‌తో ప్ర‌భుత్వానికి లేఖ‌లు రాశార‌ని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయ‌ని క‌ర్ణి సేన వ్య‌వ‌స్ధాప‌కుడు లోకేంద్ర సింగ్ క‌ల్వి కుమారుడు భ‌వాని సింగ్ క‌ల్వి వివ‌రించారు. సుఖ్ధేవ్ సింగ్‌కు ఎందుకు భ‌ద్ర‌త క‌ల్పించ‌లేద‌నేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింద‌ని అన్నారు.

Also Read ; అధైర్యపడొద్దు.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

ఈ ఘ‌ట‌న‌పై అసెంబ్లీకి నూత‌నంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే దియా కుమారి స్పందిస్తూ క‌ర్ణిసేన చీఫ్ హ‌త్య దిగ్భ్రాంతికి లోనుచేసింద‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న‌ను ఖండించేందుకు త‌న‌కు మాట‌లు రావ‌డం లేద‌ని విస్మ‌యం వ్య‌క్తం చేశారు. సుఖ్ధేవ్ సింగ్ కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌చేస్తున్నాన‌ని అన్నారు. సుఖ్ధేవ్ సింగ్‌ను మంగ‌ళ‌వారం జైపూర్‌లోని ఆయ‌న నివాసంలో సాయుధ దుండ‌గులు కాల్చిచంపిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube