జిల్లా పోలీసు కార్యాలయంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం.

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 24, కర్నూలు జిల్లా:

కార్తీక మాసం పురస్కరించుకొని కర్నూలు జిల్లా పోలీసు శాఖ పరిపాలనా విభాగం ఉద్యోగులు బుధవారం మధ్యాహ్నం స్దానిక జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో కార్తీక వనభోజన మహోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఎస్పీ సి హెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ కుటుంబ సమేతంగా హాజరై ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు.
అనంతరం జిల్లా ఎస్పీ పోలీసు మినిస్టిరియల్ సిబ్బంది అందరితో కలిసి ఉసిరి చెట్టు క్రింద వనభోజనం చేశారు.

కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే మంచి జరుగుతుందని, అందరూ ప్రతి సంవత్సరం ఈ విధంగా కుటుంబసభ్యులతో కలిసి ఇటువంటి కార్యక్రమాలను జరుపుకొని సంతోషంగా ఉండాలని ఎస్పీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీమణి శ్రీమతి నాగప్రశాంతి, సెబ్ అడిషనల్ ఎస్పీ తుహిన్ సిన్హా ఐపియస్ , డిపిఓ ఎ ఓ సురేష్ బాబు, డిఐజి గారి మేనేజర్ రత్నప్రకాష్, ఎస్పీ పిఎ నాగరాజు, డిఐజి, డిపిఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Karthika Month picnic ‎ at the District Police Office.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube