ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కార్తికేయ-2’

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కార్తికేయ-2’

1
TMedia (Telugu News) :

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కార్తికేయ-2’

టీ మీడియా,సెప్టెంబర్ 27, సినిమా: ఈ ఏడాది బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌లో కార్తికేయ‌-2 ఒక‌టి. ఎన్నో వాయిదాల త‌ర్వాత ఆగ‌స్టు 12న విడుద‌లై ఈ చిత్రం పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. పోటీగా నితిన్ సినిమా ఉన్నప్పటికి ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. నిఖిల్ కెరీర్‌లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్‌లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఎలాంటి అంచ‌నాల్లేకుండా విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. బ‌హుబ‌లి, పుష్ప‌, ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఆ స్థాయిలో బాలీవుడ్‌ ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంది. ఈ సినిమాతో నిఖిల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం రూ.120కోట్ల వరకు కలెక్షన్లు సాధించి కంటెంట్ ఉన్న సినిమాల‌కు అడ్డేది అని నిరూపించింది. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో కార్తికేయ-2 ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై అధికారికంగా ప్రకటన వచ్చింది.

 

Also Read : ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌..ఆదిపురుష్ క్రేజీ అప్‌డేట్

కార్తికేయ‌-2 చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ-5 భారీ ధ‌ర‌కు డిజిట‌ల్ హ‌క్కులను కొనుగోలు చేసింది. కాగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ జీ సంస్థ ప్రకటించింది. అడ్వేంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రానికి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నిఖిల్‌కు జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌ణ్ హీరోయిన్‌గా న‌టించింది. బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. కాగా ఈ సినిమా మ‌ల‌యాళ వెర్ష‌న్ సెప్టెంబ‌ర్ 23న విడుద‌ల కానుంది. తెలుగులో మీడియం రేంజ్ సినిమాల‌లో అత్య‌ధిక ప్రాఫిట్స్ వ‌చ్చిన రెండో సినిమాగా కార్తికేయ‌-2 నిలిచింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube