14 న విశాఖలో కార్తీకదీపోత్సవం

14 న విశాఖలో కార్తీకదీపోత్సవం

1
TMedia (Telugu News) :

14 న విశాఖలో కార్తీకదీపోత్సవం

టి మీడియా, నవంబరు 9, విశాఖ‌ప‌ట్నం : న‌వంబ‌రు 14 న విశాఖ‌ప‌ట్నం బీచ్ రోడ్‌లో నిర్వహించనున్న కార్తీక మ‌హాదీపోత్సవాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని టీటీడీ జేఈఓ శ్రీ‌మ‌తి స‌దా భార్గవి కోరారు. ఈ నేపథ్యంలో ఆమె టీటీడీ అధికారులు, దాత‌ల‌తో స‌మావేశమై చర్చించారు. కార్యక్రమంలో పాల్గొనే భ‌క్తుల‌కు పాసులు ముందుగానే జారీ చేయాల‌ని సూచించారు. తిరుమ‌ల నుంచి విశాఖ‌కు వెళ్లే స్వామి, అమ్మవార్ల ఉత్సవ‌మూర్తుల‌ను 14 సాయంత్రం ఊరేగింపుగా వేదిక‌కు తీసుకురావ‌డానికి అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయాల‌న్నారు. విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసుల‌తో స‌మ‌న్వయం చేసుకుని బందోబ‌స్తు చేయాల‌ని చెప్పారు. అతిథుల జాబితాను దాత‌లు ముందుగానే అంద‌జేయాల‌ని కోరారు.

Also Read : ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ ఉండ‌దు : జోస్ బ‌ట్ల‌ర్‌

ఈ సమావేశంలో శ్రీ‌వారి ఆల‌య ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ఎస్వీబీసీ సీఈఓ ష‌ణ్ముఖ్ కుమార్‌, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వర‌రావు, ఎస్ఈ-2 జ‌గ‌దీశ్వర్‌రెడ్డి, వీజీఓ మనోహ‌ర్, డిప్యుటీ ఈఓలు ర‌మేష్ బాబు, సుబ్రహ్మణ్యం, అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్‌ ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, దాత‌లు కృష్ణ ప్రసాద్, రాజేష్‌, హిమాంశుప్రసాద్‌, ముర‌ళి త‌దిత‌రులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube