లోక్‌స‌భ‌లో జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్ర బ‌డ్జెట్‌

లోక్‌స‌భ‌లో జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్ర బ‌డ్జెట్‌

1
TMedia (Telugu News) :

లోక్‌స‌భ‌లో జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్ర బ‌డ్జెట్‌

టి మీడియా, మార్చి 14 ,న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ లోక్‌స‌భ‌లో జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. అంత‌క‌ముందు స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాలు జ‌రిగాయి. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల త‌ర‌లింపు గురించి డీఎంకే నేత టీఆర్ బాలు ప్ర‌శ్న వేశారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల‌ను ర‌ష్యాకు త‌ర‌లించార‌ని, అక్క‌డి వ‌ర్సిటీల్లో విద్యార్థుల‌ను చేర్చుతారా అని ఆయ‌న అడిగారు. అయితే మెడిక‌ల్ విద్య‌కు సంబంధించిన ప్ర‌శ్న‌కు ఆరోగ్య‌శాఖ స‌మాధానం ఇస్తుంద‌ని స్పీక‌ర్ బిర్లా తెలిపారు. టూరిజం శాఖ‌లో కోవిడ్ వ‌ల్ల దెబ్బ‌తిన భార‌తీయ ఉద్యోగుల‌ను ఆదుకోవాల‌ని ప్ర‌భుత్వాన్ని ఎంపీ శ‌శి థ‌రూర్ వేడుకున్నారు. టూరిస్టు బ‌స్సుల‌పై ఉన్న ప‌న్నుల‌ను త‌గ్గించాల‌ని ఆయ‌న కోరారు. ప‌న్నుల క‌ట్ట‌లేక టూరిస్టు బ‌స్సుల‌ను అమ్మేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ అంశం రాష్ట్రాల ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని కేంద్ర ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి తెలిపారు. దేశంలోని బాల కార్మికుల‌కు చెందిన డేటా లేద‌ని కాంగ్రెస్ ఎంపీ మానిక‌మ్ ఠాగూర్ తెలిపారు. నేష‌న‌ల్ చైల్డ్ లేబ‌ర్ ప్రాజెక్టుకు ప్ర‌భుత్వం నిధుల‌ను విడుద‌ల చేయ‌డం లేద‌న్నారు.

Also Read : ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు ఎన్‌బీఏ గుర్తింపు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube