సీఎం కేసీఆర్ పుట్టినరోజున సేవా కార్యక్రమాలు నిర్వహించాలి.
– -బిఆర్ఎస్ యువజన అధ్యక్షులు చింత నిప్పు
టీ మీడియా,ఫిబ్రవరి 17, ఖమ్మం : మన దేశానికి దిశా నిర్దేశం చేసే ప్రగతి రథసారథి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు ఫిబ్రవరి 17న సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని బిఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు చింత నిప్పు కృష్ణ చైతన్య తెలియజేశారు. యువజన విభాగం సభ్యులంతా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు సేవలు అందించాలని కోరారు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి సీఎం కేసీఆర్ భారతదేశానికే రోల్ మోడల్ గా నిలిచారని కృష్ణ చైతన్య పెర్కోన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన కొద్ది నెలల్లోనే దేశంలోనే ఇతర రాష్ట్రాల ప్రజలు తెలంగాణ సంక్షేమ పథకాల గురించి చర్చించుకుంటున్నారని వివరించారు. తెలంగాణ రథసారథి సీఎం కేసీఆర్ జన్మదినాన్ని ఒక పండుగలా ప్రజలకు అంకితం చేస్తూ సేవా కార్యక్రమాలతో నిర్వహించాలని కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు.