రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్

నామ నాగేశ్వ‌ర రావు

0
TMedia (Telugu News) :

రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్

-నామ నాగేశ్వ‌ర రావు

టి మీడియా, ఎప్రిల్ 14,ఖ‌మ్మం:

తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు రైతు బాంధవుడ‌ని… రైతాంగ శ్రేయోస్సు కోసం ఆయ‌న వ‌డ్లు కొంటామ‌ని తీసుకున్న నిర్ణ‌యంపై అన్న‌దాత‌ల్లో హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ఉమ్మ‌డి జిల్లా వ్యాప్తంగా రైతులు, రైతుబంధు నేత‌లు, టీఆర్ఎస్ నాయ‌కులు పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకాలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ నామ నాగేశ్వ‌రరావు సీఎం కేసీఆర్‌ను రైతు బాంధ‌వుడిగా అభివ‌ర్ణిస్తూ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌న బాధ్య‌త‌ను మ‌ర‌చినా… రాష్ట్ర ప్ర‌భుత్వం రైతాంగంపై ప్రేమ‌తో ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని స్ప‌ష్టం చేశారు. రైతుల సంక్షేమ‌మే త‌మ ధ్యేయ‌మ‌ని చెప్పారు.

Also Read : బాంబు లేదు భయపెట్టారు

ఇక జిల్లాలో సీఎం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పెద్ద ఎత్తున‌ క్షీరాభిషేకాలు చేశారు. బిజెపి ప్రభుత్వం వరి రైతులను మోసం చేసిందని వారి బాధ్యతను విస్మరించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని ప్రతి గింజ కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపి వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని కేసీఆర్ ప్రకటించడం పట్ల యావత్ రాష్ట్ర రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రైతుల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి దేశంలోనే కెసిఆర్ అగ్రస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube