కేసీఆర్ మంచిగానే ఉన్నారు

వారం విశ్రాంతి అవసరం

1
TMedia (Telugu News) :

కేసీఆర్ మంచిగానే ఉన్నారు

-వారం విశ్రాంతి అవసరం

అపోలో వైద్యులు వెల్లడి

టి మీడియా, మార్చి11,హైదరాబాద్‌: స్వల్ప అస్వస్థతకు గురైన సీఎం కేసీఆర్‌కు యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వై exద్యులు మీడియాకు వివరించారు. కేసీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు డా.ఎంవీ రావుతో పాటు మరికొందరు యశోద ఆస్పత్రి వైద్యులు వివరాలను వెల్లడించారు.

‘ఈ ఉదయం 8 గంటల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. ప్రగతి భవన్ కి వెళ్లి పరిశీలించాం. రెండ్రోజులుగా అలసిపోయినట్లు సీఎం చెప్పారు. ఎడమ చేయి నొప్పి ఉందన్నారు. కొన్ని పరీక్షలు చేయాలి.. ఆస్పత్రికి రావాలని సీఎంకు మేం సూచించాం. సర్వైకల్‌ స్పైన్‌ వల్ల నరంపై ఒత్తిడి పడి చెయ్యి నొప్పి వచ్చింది. వరుస పర్యటనలు, ఉపన్యాసాలు చేయడం వల్ల నీరసంగా ఉన్నారు.

Also Read : విగ్రహ ఆవిష్కరణ కరపత్రం రిలీజ్

యాంజియోగ్రామ్‌ నిర్వహిస్తే బ్లాక్స్‌ లేవని తెలిసింది. గుండె పనితీరు బాగానే ఉందని పరీక్షల్లో తేలింది. గుండెకు సంబంధించిన పరీక్షల్లో సాధారణంగా ఉందని రిపోర్టులు వచ్చాయి. కేసీఆర్‌కు బీపీ, షుగర్‌ సాధారణంగా ఉన్నాయి. రక్త పరీక్షల్లోనూ ఎలాంటి సమస్యలు లేవని తేలింది. వైద్య పరీక్షల తర్వాత 3-4 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచుతాం. మధ్యాహ్నం 3 గంటలకు సీఎంను డిశ్చార్జ్‌ చేస్తాం. వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించాం. ఆ తర్వాత ఆయన పనులను యాథావిధిగా చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చే సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తాం ’ అని వైద్యుల బృందం వెల్లడించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube