కేసీఆర్ బాధ్యత మరిచి పని చేస్తున్నారు

గ్రామస్తుల సమక్షంలోనే తేల్చుకుందము.

1
TMedia (Telugu News) :

కేసీఆర్ బాధ్యత మరిచి పని చేస్తున్నారు

-గ్రామస్తుల సమక్షంలోనే తేల్చుకుందము.

టీ మీడియా, జూలై 1,శామీర్‌పేట్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భార్య ఈటల జమున తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం శామీర్‌పేట్‌లోని తమ నివాసంలో ఈటల జమున మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత మరిచి పని చేస్తున్నారని, కావాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాము ఇప్పటి వరకు ఎక్కడా భూములను కబ్జా చేయలేదని, తమకు ఎక్కడా అక్రమంగా ఒక గుంట భూమి కూడా లేదని, ఉందని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తామని సవాల్ చేశారు. జమున హ్యాచరీస్ భూములను తాము కొనుగోలు చేశామని, తమకు అక్కడ ఉన్నది 58 ఎకరాల భూమి మాత్రమేనని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కన్ను మా భూములపై పడిందని ఆరోపించారు. పంచిన భూములకు జమున హ్యాచరీస్‌కు ఎలాంటి సంబంధం లేదని, మా భూములను పంచడానికి మా సొమ్మేమైన కేసీఆర్ జాగీరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read :  వెంకయ్యనాయుడికి మోదీ జన్మదిన శుభాకాంక్షలు

పంచిన సర్వే నెంబర్ భూములకు, మా జమున హ్యాచరీస్ సర్వే నెంబర్ భూములకు అసలు పొంతన లేదన్నారు. జమున హ్యాచరీస్ భూములను తాము కొనుగోలు చేసినట్టు తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఆయనకు ఏమీ లేదని ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక చాలా సంపాదించారని ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని, అయినా తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఓటుకు పది వేలు, మద్యం బాటిళ్లు ఇచ్చి గెలిచే ప్రయత్నం చేశారని, కచ్చితంగా వాళ్లకు మహిళల పాపం తగులుతుందన్నారు. దమ్ముంటే కేసీఆర్ ఒక్కరే రావాలి, అధికారులను తీసుకొని తాము కూడా వస్తామని గ్రామస్తుల సమక్షంలోనే తేల్చుకుందామని, జమున హ్యాచరీస్ భూముల వివాదంపై సవాల్ విసిరారు. విచారణలో తాము కబ్జా చేసినట్టు తేలితే తమపై చట్టపరమైన చర్యలు తీసుకోండని సూచించారు. కానీ, అలా చేయకుండా కేవలం అసత్య ప్రచారం చేయడం దారుణమని అన్నారు. కేసీఆర్‌కు రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు తొందరలోనే గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఇప్పటి నుండి ఊరుకునేది లేదని, మీ వెంటనే పడతామని, భూములను అమ్ముకున్నా సరే మిమ్మల్ని వదిలేది లేదని తన భర్త ఈటల రాజేందర్‌కు చెప్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube