గడప గడపకు కేసీఆర్ మేనిఫెస్టో

గడప గడపకు కేసీఆర్ మేనిఫెస్టో

0
TMedia (Telugu News) :

గడప గడపకు కేసీఆర్ మేనిఫెస్టో

టీ మీడియా, నవంబర్ 18, పెబ్బేరు : పెబ్బేరు పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు దిలీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం గడప గడపకు కేసీఆర్ మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెబ్బేర్ పట్టణ కేంద్రంలోని మూడో వార్డు కౌన్సిలర్ పార్వతి కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి కేసీఆర్ మేనిఫెస్టో పై ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లాకు చేసిన అభివృద్ధి పనులపై ప్రజలకు తెలియజేస్తూ రెండోసారికూడా వనపర్తి ఎమ్మెల్యేగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని, కారు గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్, జ్యోతి, బసవరాజు గౌడు, వెంకటయ్య గౌడ్, వెంకటేష్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Also Read ; కాంగ్రెస్, టిడిపి నాయకుల సమన్వయ సమావేశం

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube