దేశానికే ఆదర్శం కేసిఆర్‌ పాలన

ఉద్యమకారులకు.. రామగుండం ఊపిరి పోస్తుంది

0
TMedia (Telugu News) :

దేశానికే ఆదర్శం కేసిఆర్‌ పాలన
-ఉద్యమకారులకు.. రామగుండం ఊపిరి పోస్తుంది
-ఎమ్మెల్యే, కోరుకంటి
టీ మీడియా,ఆగస్టు3,రామగుండం:
దేశానికే ఆదర్శం
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ గారి పాలన వారి నాయకత్వం లో అన్ని వర్గాల ప్రజల ఆర్థిక, సంక్షేమ వృద్దికి కృషి చేస్తు, తెలంగాణ అభివృద్దికి ప్రణాళిక రూపొందించడంలో అహర్నిశలు పాటుపడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే, టిఆర్‌ఎస్‌ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్‌ గారు అన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పలుపక్షాలకు చెందిన నాయకులకు ఎమ్మెల్యే చందర్‌ గారి సమక్షంలో టి.ఆర్.ఎస్ పార్టీ లో చేరారు. వారిని ఎమ్మెల్యే గారు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. కేసిఆర్‌ గారి సంక్షేమ పథకాలకు, ఆయన ముందుచూపు ప్రణాళికలకు ఆకర్షితులై టిఆర్‌ఎస్‌ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతుండటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రామగుండంలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఈ ప్రాంతాన్ని సమిష్టిగా అభివృద్ది చేసుకుందామన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు గుప్పించిన, నిరాధారమైన ప్రచారాలు చేసినప్పటికి ప్రజలు నమ్మరని అన్నారు.

 

Also Read : ఆన్లైన్ మోసాలపై అవగాహన సదస్సు

 

ఉద్యమకారుల ఎవరో, రాజకీయ పదవుల కోసం పనిచేసిందో ఎవరోనని ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమకారులు న్యాయనీరతిగా పనిచేస్తారని, ఇప్పటికీ, ఎప్పటికి రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ గెలవడం ఖాయమని ఎమ్మెల్యే గారు అన్నారు. రానున్న రోజుల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ ఒక ఎదురులేని రాజకీయ శక్తిగా ఏర్పాటు కావడంలో సందేహం లేదన్నారు. రామగుండం ప్రాంత అభివృధ్దిని ఓర్వలేకనే ప్రతిపక్షాల నాయకులు ప్రజల్లో విషాన్ని నింపడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజలు ఎట్టి పరిస్థితిలో నమ్మకపోగా, వారి దుష్ప్రచారాలను తిప్పికొడుతారన్నారు. నాయకులు చిప్ప రాజేశం ఆధ్వర్యంలో చేరిన తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఉద్యమకారుడు నంబయ్య, మోరె శ్రీనివాస్‌, టిఆర్‌ఎస్‌ యువజన విభాగం మాజీ సభ్యుడు దేవరకొండ క్రాంతి, తెలంగాణ ఉద్యమం, దళిత ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించిన వడ్లూరి శ్రీనివాస్‌, విప్లవ, కార్మిక సంఘ ఉద్యమాలు చేసిన విజయదేవరకొండ బుచ్చన్నలు టిఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరడం పార్టీ కి మరింత బలం చేకురిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి మేయర్‌ నడిపల్లి అభిషేక్‌ రావు, కార్పొరేటర్‌ పాముకుంట్ల భాస్కర్‌, నాయకులు బోడ్డు రవీందర్ నారాయణదాసు మారుతి, మెతుకు దేవరాజ్‌, పర్లపల్లి రవి, పిల్లి రమేష్‌, తోకల రమేష్‌, చిన్నమూల విజయ్‌, వీరాలాల్‌, బొడ్డు మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube