అర్థరాత్రి కాలు జారిపడ్డ కేసీఆర్..

- ఫామ్‌హౌస్‌ నుంచి యశోదాకు తరలింపు

0
TMedia (Telugu News) :

అర్థరాత్రి కాలు జారిపడ్డ కేసీఆర్..
– ఫామ్‌హౌస్‌ నుంచి యశోదాకు తరలింపు

– ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

టీ మీడియా, డిసెంబర్ 8, హైదరాబాద్‌ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆయన ఇంట్లో కాలు జారి పడటంతో గాయమైనట్లు సమాచారం. కేసీఆర్ తుంటి ఎముక విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్థరాత్రి కాలికి పంచె తగలడంతో, కేసీఆర్ కాలు జారి పడినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. కేటీఆర్‌ కుటుంబంతోపాటు హరీష్‌రావు కూడా రాత్రే యశోదాకి వెళ్లారు. తెల్లవారుజాము వరకూ అక్కడే ఉన్నారు. వైద్యులతో మాట్లాడిన తర్వాత.. కాసేపట్లో చేయబోయే వైద్య పరీక్షలపై డాక్టర్లు క్లారిటీ ఇచ్చాక ఇంటికి వెళ్లారు. కేసీఆర్‌కి యశోదా ఆస్పత్రిలోని 9వ ఫ్లోర్‌లో చికిత్స కొనసాగుతోంది. వైద్యులు టెస్ట్‌లు చేసిన తర్వాత హెల్త్‌ బులెటిన్‌ ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం ఆరా.. రేవంత్ రెడ్డి ఆదేశాలతో యశోద హాస్పిటల్‌కు ఆరోగ్యశాఖ కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం కార్యాలయం ఆరా తీసింది. కేసీఅర్‌ యశోదా ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వం తరపున ఐఏఎస్ రిజ్వీను యశోదాకు పంపి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఅర్‌ యశోదా ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

Also Read : విద్యుత్ అప్పులు.. బకాయిలు లెక్కలు తేల్చండి

ప్రభుత్వం తరపున ఐఏఎస్ రిజ్వీను యశోదాకు పంపి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. గాయం కారణంగా యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కేసీఆర్‌ ఆరోగ్యంపై సమాచారాన్ని తనకు తెలియజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీకి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి రిజ్వీ వైద్యులతో మాట్లాడారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆయన మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్‌ రెడ్డికి పరిస్థితిని వివరించారు రిజ్వీకేసీఆర్‌ కుటుంబ సభ్యులతో రిజ్వీ మాట్లాడారు.గురువారం అర్థరాత్రి బాత్‌రూమ్‌లో కేసీఆర్‌ కాలు జారిపడటంతో తుంటికి గాయమయింది. దీంతో హుటాహుటిన ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు, సీటీ స్కాన్‌ కూడా చేసి శస్త్రచికిత్స అవసరం తెలిపారు. తాజాగా కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కేసీఆర్‌ ఎడమ కాలి తుంటి ఎముక మార్పిడి చేయాలని సూచించారు.అటు కేసీఆర్‌ ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలిసి పార్టీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు అంతా సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్తున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు కూడా కేసీఆర్‌ను పరామర్శించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్‌ చేశారు ప్రధాని మోదీ. కేసీఆర్‌ గాయపడ్డారని తెలిసి బా ధకలిగిందన్న మోదీ..కేసీఆర్‌ ఆరోగ్యం బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాని చెప్పారు. గాయం నుంచి కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు ప్రధాని మోదీ.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube