వ్యవసాయ రంగంలో రైతుకు అన్ని విధాలా అండగా నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్   

రైతులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పని చేసి వృద్ధి సాధించాలి

1
TMedia (Telugu News) :

వ్యవసాయ రంగంలో రైతుకు అన్ని విధాలా అండగా నిలిచిన ఏకైక నాయకుడు కేసీఆర్

-ఎంపీ నామ

-పామాయిల్ సాగులో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాష్ట్రానికి మార్గదర్శకం.

– రైతులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పని చేసి వృద్ధి సాధించాలి.

-వానాకాలం సాగుకు సన్నాహక సమావేశంలో మంత్రులతో పాల్గొన్న ఎంపీ నామ

టి మీడియా,మే19,ఖమ్మం;
నగరం లోని ఎస్.ఆర్ గార్డెన్స్ నందు గురువారం వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు అధ్యక్షతన జరిగిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వానాకాలం పంటల సాగుకు అవగాహన సన్నాహక సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి లతో కలసి టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ నాయకుడు రైతు గురించి ఆలోచన చేయలేదని కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో రైతుకు అన్ని విధాలా అండగా నిలిచారని పేర్కొన్నారు.

Also Read : టెలికం బోర్డ్ మెంబర్ లుగాబిజెపి శ్రేణుల నియామకం

నేడు వ్యవసాయ రంగం అభివృద్ధి లో ,రైతు సంక్షేమం లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉందని తెలిపారు. రైతుకు సాగునీరు అందించి వారికి పంట పెట్టుబడి సాయం రైతు బంధు ద్వారా ఇస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తూ మరో పక్క రైతుకు రైతుబీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసే దిశగా అడుగులు వేయాలని ప్రస్తుతం పామాయిల్ పంట సాగులో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు వేదికల్లో రైతులు, వ్యవసాయ అధికారులు కలసి సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ పంటలు సాగు చేయాలి, ఏ పంట సాగు చేయడం ద్వారా రైతుకు లాభదాయకంగా ఉంటుంది లాంటి అంశాలు చర్చించుకొని సమన్వయం తో వృద్ధి సాధించాలని సూచించారు.

Also Read : డివిజన్ లో విస్తృతంగా పర్యటించిన సూడా డైరెక్టర్ ముఖ్తార్ షేక్

కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్, మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్ లు గౌతమ్, అనుదీప్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ శేషగిరిరావు, ఖమ్మం నగర మేయర్ నీరజ, రాష్ట్ర మార్క్ ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, గ్రంధాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, దిండిగాల రాజేందర్, ఖమ్మం నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రను, రాష్ట్ర, జిల్లా వ్యవసాయ అధికారులు, సహా పలువురు అధికారులు, రైతు బంధు సమితి కో- ఆర్డినెటర్స్, నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube