మహాత్మా గాంధీ కి కె సి ఆర్ నివాళులు

మహాత్మా గాంధీ కి కె సి ఆర్ నివాళులు

0
TMedia (Telugu News) :

మహాత్మా గాంధీ కి కె సి ఆర్ నివాళులు

టీ మీడియా, జనవరి 30, హైదరాబాద్: కుల, మత, వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మాగాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణావసరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయనను స్మరించుకున్నారు. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు తన జీవితాన్ని అర్పించిన మహాత్మాగాంధీ ఈ దేశ పురోగమనానికి సదా ఓ దిక్సూచిలా నిలుస్తారని సీఎం పేరొన్నారు.

Also Read : ముగిసిన జోడో యాత్ర..

నమ్మిన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను లెక చేయకుండా ఒకొకటిగా అధిగమిస్తూ విజయ తీరాలకు చేరాలనే స్ఫూర్తిని గాంధీ జీవితం నుంచి ప్రతి ఒకరూ నేర్చుకోవాల్సి ఉన్నదని చెప్పారు. గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube