గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తా-రేగా

0
TMedia (Telugu News) :

పలు సమస్యలపై స్పందించిన రేగా

రమ్య కుటుంబానికి ఆర్థిక సాయం

టీ మీడియా,డిసెంబర్ 30,కరకగూడెం;

కరకగూడెం మండలంలోని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇంటింటికి కేసీఆర్ -గ్రామ గ్రామాన టీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా వెంకటాపురం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ యొక్క కష్టాలను,సమస్యలను రేగా దృష్టికి తీసుకురావడంతో తక్షణమే స్పందించి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.విద్యార్థుల భద్రత కోసం వెంకటాపురం పాఠశాలకు సి డి పి నిధుల ద్వారా ప్రహరీ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.

Financial assistance to Ramya’s family

అదే విధంగా పోలెబోయిన రమ్య మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 20 వేల రూపాయలు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పోలెబోయిన పాపమ్మ,పార్టీ నాయకులు కొంపెల్లి పెద్ద రామలింగం,కొమరం రాంబాబు,చిట్టి సతీష్,రామకృష్ణ రెడ్డి,కొంపెల్లి చిన్న రామలింగం,జాడి రామానాథం,గుడ్ల రంజిత్ కుమార్,కటకం లెనిన్,శ్రీను,నాగేష్,బుషణం,సర్పంచులు పాయం నరసింహారావు,కొమరం విశ్వనాథం,పోలెబోయిన నర్సింహారావు,చిట్టిమల్ల ప్రవీణ్ కుమార్,పోలెబోయిన విష్ణు మూర్తి తదితరులు పాల్గొన్నారు.

KCR Village TRS program
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube