మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే.. వచ్చేది తెలంగాణ ప్రభుత్వమే
– కేటీఆర్
టి మీడియా, డిసెంబర్ 6, హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవం చేసిన కేటీఆర్, అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పరిధిలో మెట్రో కారిడార్ పొడిగింపుపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత హయత్‌నగర్ వరకు మెట్రో కారిడార్‌ను పొడిగించడం జరుగుతుందన్నారు. అంతేకాదు.. నాగోల్-ఎల్బీ నగర్ మధ్య మెట్రో అనుసంధానించడం జరుగుతుందన్నారు. అంతేకాదు.. త్వరలోనే మూసీపై 14 బ్రిడ్జిలను కడతామని ప్రకటించారు కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది టీఆర్ఎస్సే అని, మళ్లీ సీఎం అయ్యేది కేసీఆరేనని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ఎల్బీనగర్ పరిధిలో మంత్రి కేటీఆర్ పలు అభివద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
Also Read : ప్రత్యేక రాహుకేతు పూజలు జరిపించిన బ్రెజిల్ భక్తులు
బండ్లగూడ చెరువు నుంచి నాగోల్ చెరువు వరకు నాలా బాక్స్ డ్రైన్‌ను ప్రారంభించారు. అలాగే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ నుంచి ఫిర్జాదిగూడ వరకు.. లింక్‌రోడ్డు ప్రారంభించారు. ఫతుల్లాగూడ జంతు సంరక్షణ కేంద్రంలో.. పెట్ యానిమల్ శ్మశాన వాటిక ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు.