ఢిల్లీలో అధికార నివాసం ఖాళీ చేయనున్న కేసీఆర్

- 20 ఏళ్ళ అనుబంధానికి తెర

0
TMedia (Telugu News) :

ఢిల్లీలో అధికార నివాసం ఖాళీ చేయనున్న కేసీఆర్

– 20 ఏళ్ళ అనుబంధానికి తెర

టీ మీడియా, డిసెంబర్ 5, హైదరాబాద్ : తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామనుకున్న కారు పార్టీకి ఇక్కడి ఓటర్లు సడెన్ బ్రేకులు వేసారు. తెలంగాణ అర్బన్ ఓటర్లు బీఆర్ఎస్‌ను ఆదరించినా.. రూరల్ ఓటర్లు మాత్రం వార్ వన్ సైడ్ అన్నట్టు ఏక పక్షంగా కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు. దీంతో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం తన రాజీనామా లేఖను కేసీఆర్ రాజ్ భవన్ కు పంపారు. బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడంతో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 64 సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటికే సీఎంగా అధికారంలోంచి దిగిపోయిన తర్వాత సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌ను ఖాళీ చేసిన సీఎం కేసీఆర్.. తాజాగా ఢిల్లీలోని తుగ్లక్ రోడ్‌లోని సీఎం అధికారిక నివాసం ఖాళీ చేయనున్నారు. దేశ రాజధాని దిల్లీోని 23 తుగ్లక్ రోడ్‌లో ఉన్న అధికారిక నివాసంతో ఉన్న కేసీఆర్ 20 ఏళ్ల అనుబంధానికీ తెర పడింది. 2004లో టీఆర్ఎస్ తరుపున కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన కేసీఆర్.. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ క్యాబినేట్‌లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

Also Read : పాగాల సంపత్‌రెడ్డి భౌతికకాయానికి నివాళులు

సెంట్రల్ మినిష్టర్ హోదాలో ఆయనకు తుగ్లక్‌ రోడ్‌లోని టైప్‌ 8 క్వార్టర్‌ను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. 2006లో కేసీఆర్.. సెంట్రల్ మినిష్టర్ పదవికి, ఎంపీ పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. ఉపఎన్నికలో మళ్లీ ఎంపీగా గెలిచి అదే నివాసంలో ఉంటూ వస్తున్నారు. 2009లో మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా ఎన్నికై అదే క్వార్టర్‌లో ఉన్నారు. 2014లో కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర ప్రభుత్వం దిల్లీలో అధికారిక నివాసాలు కేటాయిస్తుంది. ఇందులో భాగంగా అదే నివాసాన్ని కేసీఆర్‌కు కేటాయించింది. అదే సమయంలో నిజామాబాద్‌ ఎంపీగా గెలుపొందిన కేసీఆర్‌ కుమార్తె కవిత కూడా అదే ఇల్లును తన అధికారిక నివాసంగా ఎంచుకున్నారు. అలా ఆ క్వార్టర్‌ ముఖ్యమంత్రికి, ఎంపీ కవితకు.. అధికారిక నివాసంగా మారింది. 2018లో కేసీఆర్‌ రెండో దఫా ముఖ్యమంత్రి అయ్యాక అదే నివాసాన్ని కొనసాగించారు. ప్రస్తుత ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటమి పాలైయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేసారు. ఇప్పటికే ప్రగతి భవన్‌ను ఖాళీ చేసిన కేసీఆర్.. దిల్లీలోని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేస్తామని అధికారులకు సమాచారం అందజేశారు. అందుకు రెండుమూడు రోజులు సమయం కావాలని అధికారులకు బీఆర్ఎస్ వర్గాలు ఇప్పటికే నివేదించినట్లు తెలిసింది.

Also Read : అడవి పందుల దాడిలో వరి పంట నష్టం

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు నెలల గడువు ఇచ్చి ఆ తర్వాత సమస్యలపై పోరాడదమని చెప్పుకొచ్చారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2 2014న ప్రమాణ స్వీకారం చేసారు. ఆ తర్వాత 2018లో రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక మూడోసారి ముఖ్యమంత్రి కావాలనుకున్న సీఎం కేేసీఆర్‌ను గద్దె దించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 38.08 శాతం ఓట్లు వచ్చాయి. 39 సీట్లు గెలిచారు. స్వయంగా కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి పాలు కావడం విశేషం. అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి రేవంత్ రెడ్డి కూడా ఓటమి పాలైయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.89 శాతం ఓట్లు పోలైయ్యాయి. అటు బీజేపీకి 13.91 శాతం ఓట్లు వచ్చాయి. అటు బీఎస్పీకి 1.18 శాతం ఓట్లు వచ్చాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube