కాంగ్రెస్ పార్టీ అంటేనే కేసీఆర్ కుటుంబానికి భయం..
కాంగ్రెస్ పార్టీ అంటేనే కేసీఆర్ కుటుంబానికి భయం..
కాంగ్రెస్ పార్టీ అంటేనే కేసీఆర్ కుటుంబానికి భయం..
టీ మీడియా ఆగస్ట్ 20 నడిగూడెం : స్వాతంత్రం తీసుకువచ్చి దేశం ప్రజల కోసం ప్రాణాలను ఇచ్చి దేశాన్ని అభివృద్ధిలో నడిపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని కెసిఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావులకు కాంగ్రెస్ పార్టీ అంటే భయం పట్టుకుందని మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను మండ ప్రధాన కార్యదర్శి వేపూరి సుదీర్ లు అన్నారు .ఆదివారం కెసిఆర్ సభను అడ్డుకుంటారని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఆదివారం ఉదయం ముందస్తుగా అరెస్టు చేశారు.అరెస్టులను ఖండిస్తూ రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వస్తే బడుగు బలహీన వర్గాలకు నిరుద్యోగులు యువకులకు కార్మికులకు కర్షకులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకొని దాచుకొని తింటూ సంపాదనే ధ్యేయంగా దొరల పాలన కొనసాగుతుందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కులాలుగా మతాలుగా విభజించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
also read: అభివృద్ధి గాముకుడు రాం సహాయం
ఎలాంటి నిబంధనలు విధించకుండా సొంత స్థలం ఉండి దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ గృహలక్ష్మి పథకం వర్తింపచేయాలన్నారు. మద్యం టెండర్లకు మూడు నెలలు ముందుగా
దరఖాస్తుల పేరు మీద వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని కెసిఆర్ ఎన్నికలకు వస్తున్నాడని మళ్లీ కేసీఆర్ గెలిస్తే పేద మధ్యతరగతి అనగారిన వర్గాలు అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. అరెస్ట్ అయిన వారిలో
రేపాల పురుషోత్తం ఎలుగూరి నాగరాజు షేక్ రియాజ్ మేరిగ శ్రీరామ్, మునగలేటి విజయ్, గోపి గుంజా తిరుమలేష్, దున్న రాజా, గంటెపంగు వినేష్ తదితరులు ఉన్నారు…..