ఇంటి వాతావరణం ఆరోగ్యకరంగా ఉంచుకుందాం
లహరి, ఫిబ్రవరి 1, ఆరోగ్యం : వంటచెరకు, బొగ్గు మొదలైన ఇంధనాలను చాలా ఇండ్లలో వంటకోసం వినియోగిస్తున్నారు. వంటచేసే ప్రదేశం, గది ఇరుకుగా ఉండటం లేక గాలి బయటకు వెళ్ళే అవకాశం లేకపోవటం వల్ల పొగ ఒక చోటే ఉండిపోతుంది. ఇది కంటికి, ఊపిరితిత్తులకు ఎంతో ప్రమాదకరం.
ఇంట్లో తయారయ్యే చెత్త
జీవవిచ్చిత్తి అయ్యే పదార్థాలు, విచ్చిత్తి కాని పదార్థాల మధ్య తేడాలు గుర్తిద్దాం. 2. గృహసంబంధ వ్యర్థాలను సరైన రీతిలో (విచ్చిత్తి చేయగల లేదా చేయలేని పదార్థాలను) వేరుచేయాల్సిన అవసరాన్ని అర్ధంచేసుకుందాం.
చుట్టూ నీరు అయినా దాహం
మానవ జీవనానికి ఋతుపవనాలకు గల సంబంధాన్ని అవగాహన చేసుకుందాం.
చెత్త సేకరించే వారి ఆరోగ్యం పట్ల అవగాహనను కలిగింయుండడం.
చేతుల పరిశుభ్రత
దోమల బెడద దోమలవల్ల వచ్చే వ్యాధులు వ్యాపించకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు పాటిద్దాం.నిర్లక్ష్యంతోనే నీరు వృధా అవుతుంది. . మనం నిర్లక్ష్యంగా నీటిని వృథా చేస్తున్న రోజువారీ కార్యకలాపాలను గుర్తిద్దాం. నీటిని తెలివితో, బాధ్యతతో వినియోగించడం పట్ల అవగాహన పొందుదాం.
Also Read : భక్తికి, ఆధ్యాత్మికానికి చాలా తేడా
నీటి కాలుష్యం వలన వచ్చే వ్యాధులు
మన చుట్టూ ఉన్న పరిసరాలను మన అలవాట్లతో, ప్రవర్తనతో మలినం చేస్తున్నాము. తినే అన్నాన్ని, త్రాగే నీటిని, పీల్చేగాలిని చేతులారా మనమే కలుషితం చేసి, మన ఆరోగ్యాన్ని హానికరం చేసుకొంటున్నాము.
ప్రకృతిని పవిత్రంగా చూద్దాం.
ప్రకృతిని,పవిత్ర ప్రదేశాలను పవిత్రంగా చూడడం మన బాధ్యత అని తెలుసుకుందాం.
ఫ్లోరోసిస్
ఫ్లోరోసిస్ సమాజం మీద కలిగించే ప్రభావాన్ని తెలుసుకోడం.
మన పరిసరాలలో మార్పులు వాటి ప్రభావాలు మార్పు అతి సహజమైనది. ప్రతి అంశంలోనూ కాలంతోపాటు మార్పును గమనించవచ్చు.నిత్యం మన పరిసరాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటుంటాయి.
పరిసరాలలోని నీటి వనరులు
ఆదిమకాలంలో మానవ నివాసాలన్నీనీటి వనరుల సమీపంలో ఉండేవి. వాటిలో సరస్సులు, కొలనులు, నదులు, వాగులు మొదలైనవి ముఖ్యమైనవి.
ఆహార పదార్ధాల వృధాను తగ్గిద్దాం.
సాధారణంగా వునం ఎన్నో రకాల ఆహారపదార్దాలను వినియోగిసుంటాం. వినియోగించుకోగా మిగిలిన ఆహార పదార్ధాలను వ్యర్థం చేయటం లేదా పారవేయటంలాంటివి చేస్తుంటాం.
Also Read : పాతాళాన్ని చూడాలనుకుంటున్నారా
వాన నీటిని దాచుకుందాం
నీటి ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం.మరియు వర్షపు నీటిని కాపాడుకునే విధానాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలలో పాల్గొందాం.
వ్యక్తిగత పరిశుభ్రత
మనం తినే భోజనం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునే తీరు, వ్యాయామం, సురక్షితమైన లైంగిక సంబంధము శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తాయి. మన గ్రామాలలో వచ్చే వ్యాధుల్లో శరీర పరిశుభ్రత లోపించడం వల్ల వచ్చే వ్యాధులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.సాధారణంగా కొన్ని రకాల వ్యాధులు వివిధ బుతువులు, కాలాల్లో వసుంటాయి. వాటికి సంబంధించిన కారణాలు, లక్షణాలు తెలుసుకుంటే ఆ వ్యాధులను నివారించడమే కాకుండా వాటి వ్యాప్తిని అరికట్టవచ్చు.