స్టాలిన్గ్రాడ్ తరహాలోనే కీవ్ పోరాడుతుంది
టి మీడియా,మర్చి 12,కీవ్: రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రష్యాలోని స్టాలిన్గ్రాడ్ నగరం భీకర పోరు సాగించిన విషయం తెలిసిందే. ఆ యుద్ధం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పుడు రాజధాని కీవ్‌పై దండెత్తి వస్తున్న రష్యా దళాలకు వ్యతిరేకంగా ఆ నాటి తరహాలో పోరు తప్పదని ఉక్రేనియన్లు అంటున్నారు. భారీ కాన్వాయ్‌తో ముట్టడికి వస్తున్న రష్యా బలగాలను తిప్పికొట్టేందుకు కీవ్ సంసిద్దమైంది. అయితే రష్యాలోని స్టాలిన్గ్రాడ్ ఎలా పోరాడిందో.. ఇప్పుడు అలాగే కీవ్ కూడా ప్రతిస్పందిస్తుందని ఆ దేశ ఎంపీ సియాతస్లోవ్ యురా తెలిపారు. కీవ్ నగరంలో స్వచ్ఛంధ సైన్యం తయారైనట్లు ఆయన చెప్పారు.కీవ్‌పై రాత్రిపూట తీవ్ర స్థాయిలో రాకెట్ల దాడి జరుగుతోంది.
also readసింగరేణిని ప్రైవేట్‌పరం న్నది అవాస్తవం: రాజగోపాల్‌రెడ్డి
ఇక నగరం శివార్లలోనూ వీధి పోరాటాలు భీకరంగా సాగుతున్నాయి. కీవ్‌కు సమీపిస్తున్న రష్యా సైన్యం పెను నష్టాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆ ఎంపీ అన్నారు. కీవ్‌లో జనాభా లక్షల్లో ఉందని, ఒకవేళ రష్యన్లు ముందుకు వస్తే, వాళ్లకు ప్రతిఘటన తప్పదన్నారు. ఒకవేళ వాళ్లు దాడి చేస్తే, ఇదే స్టాలిన్గ్రాడ్ అవుతుందన్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో స్టాలిన్గ్రాడ్ ముట్టడి జరిగింది. ఆనాటి పోరులో సుమారు 11 లక్షల మంది రష్యన్లు చనిపోయారు. 8 లక్షల మంది నాజీ జర్మన్లు, రొమేనియా దళాలూ ప్రాణాలు కోల్పోయాయి. 1942-43లో స్టాలిన్గ్రాడ్ యుద్ధం కీలక మలుపు తిప్పింది. ఆ తర్వాత రష్యాలోకి నాజీల ప్రవేశం నిలిచిపోయింది.స్టాలిన్గ్రాడ్ను తరహాలో తమ దళాలు రష్యాను అడ్డుకుంటాయని ఎంపీ సియాతస్లోవ్ తెలిపారు. రష్యా దూకుడుకు ఎవరూ తలొగ్గేది లేదన్నారు. వాస్తవానికి ఇవాళ ఉదయం కీవ్ నగరంలో పేలుళ్లు జరిగాయి.
also read:ఆర్బిట్రేషన్ సెంటర్ ప్రపంచ ఖ్యాతి సాధించాలి: సీజేఐ ఎన్వీ రమణ
భారీ స్థాయిలో రష్యా దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కీవ్‌పై దాడిలో రష్యా బలగాలు విజయం సాధించేది అనుమానమే అని నాటో మాజీ డిప్యూటీ సెక్రటరీ రోజ్ గోటెమొల్లర్ తెలిపారు. కీవ్ దిశగా వచ్చిన రష్యా బలగాలు విడిపోయాయని, ఇది వాళ్లు వీక్నెస్కు సంకేతంగా తీసుకోవాలన్నారు.కానీ రష్యా చాలా చాకచక్యంగా ఆక్రమణ కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌లోని ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటోంది. తొలుత బోర్డర్ సమీపంలో ఉన్న నగరాలను ఆధీనంలోకి తీసుకున్న రష్యా దళాలు.
also read:హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన సిబ్బందికి సన్మానం
. ఇప్పుడు పశ్చిమ వైపు కన్నేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి నేటితో 17 రోజులు అయ్యాయి. తాజాగా మైకోలేవ్, చెర్నిహివ్, ఒడిసా, మెలిటోపోల్, మారియోపోల్ నగరాల్లో రష్యా సేనలు తిష్ట వేశాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం సిరియా తరహాలో సాగుతోందని కొందరు నిపుణులు అంటున్నారు. సిరియాలో యుద్ధం కొన్నేళ్ల పాటు సాగింది. ఇప్పుడు ఉక్రెయిన్లోనూ ఇదే తరహా సీన్లు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube