ఈడీ నోటీసులపై కేజ్రీవాల్ ఆగ్రహం
టీ మీడియా, నవంబర్ 2, ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని, పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అన్నారు. బీజేపీ ఆదేశాల మేరకే ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవడానికే నోటీసులు జారీచేశారని ఆరోపించారు. సమన్లు వెంటనే వెనక్కీ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధమున్న మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు అక్టోబర్ 30న ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. అయితే విచారణకు గైర్హాజరైన ఆయన.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు పయణమయ్యారు.
Also Read : ఎంపీపై కత్తితో దాడిపై కీలక విషయాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ శ్వేత
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube