కేజ్రీవాల్ జైల్లో కూడా విపాస‌న చేయ‌గ‌ల‌రు

కేజ్రీవాల్ జైల్లో కూడా విపాస‌న చేయ‌గ‌ల‌రు

0
TMedia (Telugu News) :

కేజ్రీవాల్ జైల్లో కూడా విపాస‌న చేయ‌గ‌ల‌రు

– బీజేపీ ఎద్దేవా

టీ మీడియా, డిసెంబర్ 21, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ గురువారం తీవ్ర‌స్ధాయిలో విరుచుకుప‌డింది. జ‌వాబుదారీత‌నం, అర‌వింద్ కేజ్రీవాల్ క‌లిసి సాగ‌లేర‌ని కాషాయ పార్టీ ఎద్దేవా చేసింది. కేజ్రీవాల్‌, క‌ర్త్య‌వ్యం ఎన్న‌డూ క‌లిసి ప‌నిచేయలేవ‌ని బీజేపీ నేత సంబిట్ పాత్ర స్ప‌ష్టం చేశారు. కేజ్రీవాల్ జైల్లో విపాస‌న చేయ‌గ‌ల‌ర‌ని వ్యాఖ్యానించారు. విపాస‌న పేరుతో త‌ల‌దాచుకునేందుకు కేజ్రీవాల్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. కాగా మ‌ద్యం కుంభ‌కోణానికి సంబంధించిన మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఈడీ త‌న‌కు స‌మ‌న్లు జారీ చేయ‌డాన్ని కేజ్రీవాల్ స‌వాల్ చేసిన అనంత‌రం బీజేపీ నేత ఈ వ్యాఖ్య‌లు చేశారు. లిక్క‌ర్ స్కామ్ కేసులో ఈడీ రెండోసారి స‌మ‌న్లు జారీ చేయ‌గా వాటిని బేఖాత‌రు చేస్తూ ఢిల్లీ సీఎం ప‌ది రోజుల విపాస‌న మెడిటేష‌న్ క్యాంప్‌కు వెళ్లారు. ఇక ఈడీ త‌న‌కు పంపిన స‌మ‌న్లు అక్ర‌మ‌మ‌ని, రాజ‌కీయ దురుద్దేశంతో కూడిన‌వ‌ని కేజ్రీవాల్ అభివ‌ర్ణించారు.

Also Read : తనయుల పొలిటికల్ ఎంట్రీ

ఈ విష‌యంలో తాను దాచేందుకు ఏమీ లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను ఎలాంటి స‌మ‌న్ల‌నైనా స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని, గ‌త స‌మ‌న్ల త‌ర‌హాలో తాజా ఈడీ స‌మ‌న్లు కూడా రాజ‌కీయ దురుద్దేశంతో కూడిన‌వ‌ని కేజ్రీవాల్ పేర్కొన్నారు. స‌మ‌న్‌ను ఉప‌సంహ‌రించాల‌ని, తాను నిజాయితీ, పార‌ద‌ర్శ‌క‌తో కూడిన జీవితం గ‌డిపాన‌ని, త‌న‌వ‌ద్ద దాచేందుకు ఏమీ లేద‌ని ఆప్ అధినేత వెల్ల‌డించారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube