ఖాకీ వెబ్ సిరీస్‌

-ఆ ఐపీఎస్ ఆఫీస‌ర్‌పై స‌స్పెన్ష‌న్‌

1
TMedia (Telugu News) :

ఖాకీ వెబ్ సిరీస్‌..

-ఆ ఐపీఎస్ ఆఫీస‌ర్‌పై స‌స్పెన్ష‌న్‌

టీ మీడియా, డిసెంబర్ 9,న్యూఢిల్లీ : బీహార్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ అమిత్ లోధా స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యాడు. ఇటీవ‌ల నెట్‌ఫ్లిక్స్‌లో పాపుల‌ర్ అయిన ఖాకీ: ద బీహార్ చాప్ట‌ర్ వెబ్ సిరీస్ తెలిసిందే. ఆ వెబ్‌సిరీస్‌కు స్టోరీ ఇచ్చింది బీహార్ ఐపీఎస్ ఆఫీస‌ర్ అమిత్ లోధా. అయితే అత‌నిపై తాజాగా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌భుత్వ హోదాలో ఉంటూ.. నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు లోధాపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆర్థిక ప్ర‌యోజ‌నాల కోసం అత‌ను ఆ డీల్ కుదుర్చుకున్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది. దీంతో అత‌న్ని స‌స్పెండ్ చేశారు.

Also Read : అరుదైన పక్షులు, జంతువుల అక్రమ రవాణా..

ఐపీఎస్ ఆఫీస‌ర్ అమిత్ లోధాపై ఐపీసీలోని 120బీ, 168 సెక్ష‌న్ల కింద కేసు ఫైల్ చేశారు. గ్యాంగ్ లీడ‌ర్‌, ఐపీఎస్ ఆఫీస‌ర్ మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ను వెబ్‌సిరీస్ క‌థాంశంగా తీసుకున్నారు. ఈ క్రైమ్ డ్రామాకు ఓటీటీలో మంచి పాపులారిటీ వ‌చ్చింది. పోలీసు పాత్ర‌ను క‌ర‌న్ టాక‌ర్‌, గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌ను అవినాశ్ తివారీ పోషించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube