కర్షకుల సేవలో వ్యవసాయ మార్కెట్ బేష్

అవార్డు అందుకున్న సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ

1
TMedia (Telugu News) :

కర్షకుల సేవలో వ్యవసాయ మార్కెట్ బేష్

-ఆధునిక సాంకేతిక సేవలు అగ్రగామి
-రాష్ట్ర స్థాయి లో రెండవ ర్యాంకు
– అవార్డు అందుకున్న సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ

-కృతజ్ఞతలు తెలిపిన
మార్కెట్ చైర్ పర్సన్
టి మీడియా,జూన్15,ఖమ్మం సిటీ బ్యూరో:
మార్కెట్ కు పంట ఉత్పత్తులు
తీసుకోవచ్చే రైతులకు
సేవలు అందించడంలో ఖమ్మం మార్కెట్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
బుధవారం హైదరాబాదులో జరిగిన అవార్డులు ప్రధానోత్సవం లో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ రెండవ స్థానం సొంతం చేసుకుంది.

 

Also Read : క్రీడాకారిణి కి మంత్రి అభినందన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ అగ్రి మార్కెట్ విధానం, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-టామ్ ఆన్ లైన్ విధానం అమలు పరచడంలో లో సత్తా చాటిన ఖమ్మం మార్కెట్ ఈ అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది.
గత కొద్ది రోజుల నుంచి స్వయంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకోవడం, రైతులకు వ్యాపారులకు కార్మికులకు సకల వసతులు కల్పించడంతో రికార్డు స్థాయిలో పెరిగాయి. తద్వారా మార్కెట్ మార్కెట్ టర్నోవర్ రికార్డు స్థాయిలో పెరిగింది.

Also Read : క్లినికల్ ల్యాబ్ నిర్మాణానికి విరాళం

దీంతో రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు దారులు పరిగణనలోకి తీసుకొని ఉత్తమ సేవలకు గాను అవార్డులు అందజేయడం జరిగింది.
మార్కెట్ కు ఉత్తమ అవార్డు రావడం పట్ల చైర్ పర్సన్ లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు , పాలకవర్గ సభ్యులు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన వ్యాపారులకు కార్మికులకు రైతులకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందించి జాతీయస్థాయిలో ఖమ్మం మార్కెట్ ను నిలబెట్టడమే తన ప్రధాన లక్ష్యమని చైర్ పర్సన్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube