రెండేళ్ల లో ఖమ్మం స్వరూపం మారుతుంది

రెండేళ్ల లో ఖమ్మం స్వరూపం మారుతుంది

0
TMedia (Telugu News) :

జాతీయ రహదారుల తో

రెండేళ్ల లో ఖమ్మం స్వరూపం మారుతుంది

ఆరు జిల్లాల కలెక్టర్ల సహకారం అద్భుతం

– భూమి కోల్పోతున్న రైతుల్లో బాధ ఉంది

– గ్రీనరి కోసం మొక్కలు నాటుతున్నాము

– ఖమ్మం – సూర్యాపేట ప్రధాని తో ప్రారంభ అవకాశం

– గ్రామాల్లో ప్రమాద నివారణ కార్యక్రమాలు

టీ మీడియా తో ఎన్ హెచ్ పిడి దుర్గ ప్రసాద్ గొల్ల

టీ మీడియా, జూలై 24, ప్రత్యేక ప్రతినిధి: జాతీయ రహదారులు నిర్మాణం లో భారత దేశం ప్రస్తుతం రెండవ స్థానం లో ఉంది. త్వరలో మొదటి స్థానం లోకి వెళుతుంది. రెండు ఏళ్ల లో జాతీయ రహదారులు నిర్మాణం పూర్తి అయ్యి ఖమ్మం స్వరూపం మారి అగ్రగామి గా నిలుస్తుంది అని జాతీయ రహదారులు ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గ ప్రసాద్ గొల్ల అన్నారు. టి మీడియా కి పిడి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. రహదారుల నిర్మాణం కోసం ఆరు జిల్లాల కలెక్టర్లు అందిస్తున్న సహకారం అద్భుతం అన్నారు. రోడ్ల కోసం భూమిని కోల్పోతున్న రైతు ల్లో బాధ ఉంది, ఉంటుంది అన్నారు. ఖమ్మం సూర్యాపేట రోడ్డు పని పూర్తి గత అక్టోబర్ లోనే వినియోగంలోకి వచ్చిదని తెలిపారు. అధికారికంగా ప్రధాని మొది తో ప్రారంభం అవకాశం ఉంది అన్నారు. జిల్లా మీదుగా జరుగుతున్న రోడ్ల పనులన్నీ గ్రీన్ ఫీల్డ్ రోడ్లు అన్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత తీసుకొన్నమని, హైవే పై ప్రమాదాలు నివారణకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని మరో ప్రశ్నకు సమాధానం గా చెప్పారు.

kmm -srpt hiway

ప్ర: జరుగుతున్న,పూర్తి అయిన పనుల వివరాలు..

జ: ఖమ్మం – సూర్యాపేట కిలోమీటర్లు, పని పూర్తి అయ్యి గత అక్టోబర్ లో అందుబాటు లోకి వచ్చింది. కోదాడ – ఖమ్మం 31.8 కిలో మీటర్లు అదాని గ్రూప్ చేస్తోంది. ఖమ్మం – వరంగల్ 90 కిలో మీటర్లు, ఖమ్మం రూరల్ మండలం తల్లం పాడు నుండి రేచర్ల వరకు 103 కిలో మీటర్లు పనులు నడుస్తున్నాయ్ అన్ని 2024 వరకు పూర్తి అవుతాయి.

Also read:  ఆటో డ్రైవర్ నుండి డ్రగ్స్ సప్లయర్ వరకు

ప్ర: కోదాడ – ఖమ్మం రోడ్డు పనులు ఎంత వరకు అయ్యాయి.

జ:కోదాడ – ఖమ్మం(వెంకటగిరి క్రాస్ రోడ్)సుమారు 55 శాతం పూర్తి అయ్యాయి.వేగంగా జరుగుతున్నాయి.

ప్ర: భూ సేకరణలో రైతులు నుండి వ్యతిరేకత వస్తోంది

జ: రైతులది వ్యతిరేకత కాదు. భూమి పోతున్న ఆవేదన వారిది. జాతీయ రహదారి వల్ల భూమి విలువలు పెరిగాయి. భూమి సేకరణ అంశం కలెక్టర్ ల పరిధి లోనిది. వారు భూమి అప్పగిస్తే పరిహారం నిధులు హై వే ప్రాజెక్ట్ ఇస్తుంది.

ప్ర: కలెక్టర్ల సహకారం ఎట్లా ఉంది ?

జ: కలెక్టర్లు సహకారం అద్భుతంగా ఉంది. ఏపి లో ఇద్దరు కలెక్టర్లు, తెలంగాణ లో సూర్యాపేట,ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ కలెక్టర్లు మొత్తం ఆరుగురు తో నిరంతరం సమన్వయం వల్ల పనులు మంచిగా నడుస్తున్నాయి.

ప్ర: జాతీయ రహదారులు వల్ల ఖమ్మం కు ప్రయోజనం.?

జ: ఖమ్మం కు నలువైపుల గ్రీన్ ఫీల్డ్ రోడ్ తో అంతర్జాతీయ కనెక్టివిటీ వస్తుంది. దాంతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి .అంతిమంగా ఆర్థికంగా ఉన్నత స్థితి వస్తుంది. మీరే చూస్తారు రెండేళ్లలో ఖమ్మం స్వరూపం మారిపోతుంది. మేము ఉన్నది ఖమ్మం లోనా అనుకుంటారు.

ప్ర: రహదారి నిర్మాణం కోసం చెట్లు నరికి పర్యావరణ ఇబ్బందులు తెస్తున్నారు ?

జ: చెట్లు అనివార్యంగా నరకాల్సి వస్తోంది. ప్రతిగా గ్రినరి బాధ్యత కూడా తీసుకున్నాం. ఖమ్మం సూర్యాపేట రహదారి లో ఇప్పటికీ 80 వేల వరకు మొక్కలు నాటాము. నేషనల్ హైవే ప్రాజక్టు ఛైర్మెన్ ఊరుకోరు. డైలీ రిపోర్ట్ అడుగుతున్నారు.

ప్ర: హైవే పై ప్రమాదాలకు కారణం?

జ: మానవ తప్పిదాలు ప్రదానంగా ప్రమాదాలకు కారణం. సూర్య పేట రహదారి ఎక్కడ మలుపు కూడా లేదు.100 స్పీడ్ లో మాత్రమే వెళ్ళాలి.140 లో వెళుతున్నారు. 180 లో కారు లో హైద్రాబాద్ వెళ్ళ అని ఓకాయన వీడియో పోస్ట్ చేశారు. రెండవది రోడ్డు కు అంచున సెక్యూర్టీ గా పిల్లర్లు లాంటివి పెట్టాం. అవి తొలగిస్తున్నారు. సర్వీస్ రోడ్లు, సబ్ వెలు ఇచ్చాం వాటి బదులు హైవే మీదుగా దాటుతున్నారు. పశువులు, గేదెలు కూడా హై వే పైకి వస్తున్నాయి. ఇటువంటి అనేక కారణాలు ఉన్నాయి. రోడ్లు నిర్మాణంలో లోపం లేవు. పూర్తి క్వాలిటీతో జరిగింది.

ప్ర: ప్రమాదాలు ఆగాలి అంటే?

జ: ప్రమాదాల నివారణ ముఖ్యం. ప్రజల్లో అవగాహన ముఖ్యం. ఆ బాధ్యత మేము తీసుకొన్నాం. హైవే వెంట ఉన్న గ్రామాల్లోని జనం కు అవగాహనకార్యక్రమాలు, పశువుల కొమ్ములకు చీకట్లో కనపడే విధంగా రేడియం స్తిక్కర్లు వేస్తున్నాము. ముఖ్యంగా యువత కు వేగ నియంత్రణ ఆవశ్యకత చెపుతున్నాము.

ప్ర: పనులు పర్యవేక్షణ?

జ: పనుల పర్యవేక్షణ కు క్షేత్రస్థాయి సిబ్బంది తో పాటు, ప్రతి ప్రాజెక్ట్ పరిధిలో మేనేజర్లు ఉన్నారు. క్వాలిటీ విషయం లో రాజి ఉండదు.
పనులు పూర్తి చేసే విషయం లో సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube