అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి
అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి
అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి
టీ మీడియా, నవంబర్ 8, వాషింగ్టన్ : అమెరికా లో కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి వరుణ్ రాజ్ (29) మృతి చెందాడు. పది రోజులుగా తీవ్ర గాయాలతో లూథరన్ దవాఖానలో చికిత్స పొందుతున్న వరుణ్.. పరిస్థితి విషమించడంతో తాజాగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన పుచ్చా వరుణ్ రాజ్ అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఎంఎస్ చదువుతున్నాడు. రోజూలాగే అక్టోబర్ 31న జిమ్‌కు వెళ్లిన వరుణ్.. తిరిగి ఇంటికి వెళ్తుండగా ఓ దుండగుడు కత్తితో పొడిచాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.
Also Read : ఈవీఎం గోదాం పనులను పరిశీలించిన కలెక్టర్
అయితే తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడి ఎడమవైపు పాక్షిక వైకల్యం బారినపడే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో వరుణ్‌కు లైఫ్‌సపోర్ట్‌తో వైద్యులు చికిత్స అందించారు. అయితే, పరిస్థితి విషమించడంతో తాజాగా ప్రాణాలు కోల్పోయాడు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube