ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఖ‌ర్గేను ప్ర‌పోజ్ చేశా.. కేజ్రీవాల్ స‌పోర్ట్ ఇచ్చారు

బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

0
TMedia (Telugu News) :

ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఖ‌ర్గేను ప్ర‌పోజ్ చేశా.. కేజ్రీవాల్ స‌పోర్ట్ ఇచ్చారు

– బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

టీ మీడియా, డిసెంబర్ 20, న్యూఢిల్లీ: రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఇండియా కూట‌మి త‌ర‌పున‌.. ప్ర‌ధాని అభ్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే పోటీ ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఇండియా కూట‌మి ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఖ‌ర్గేను ప్ర‌పోజ్ చేసిన‌ట్లు బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పేర్కొన్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె బుధవారం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధాని అభ్య‌ర్థిగా మీ కూటమి త‌ర‌పున ఎవ‌రు ఉంటార‌ని అంద‌రూ అడుగుతున్నారని, అందుకే ఖ‌ర్గే పేరును సూచించిన‌ట్లు మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. మంగ‌ళవారం జ‌రిగిన ఇండియా కూట‌మి భేటీలోనూ ఖ‌ర్గే పేరు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది.అయితే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పీఎం అభ్య‌ర్థిగా పోటీ చేసేందుకు ఖ‌ర్గే ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. తానో ఫైట‌ర్‌ను అంటూ ఖ‌ర్గే చెప్పుకున్న‌ట్లు స‌మాచారం ఉంది.

Also Read : పాకిస్థాన్ ఆర్థిక స్థితికి భార‌త్ కార‌ణం కాదు

తాను ఓ ఫైట‌ర్‌ను అని, అణ‌గారిన వ‌ర్గానికి చెందిన వ్య‌క్తినో లేక ద‌ళితుడినో అని చెప్పుకుని రాజ‌కీయాలు చేయ‌లేద‌ని, జీవితం మొత్తం స‌మాన‌త్వం కోసం పోరాడిన‌ట్లు ఇండియా కూట‌మి స‌భ్యుల‌తో ఖ‌ర్గే చెప్పిన‌ట్లు తెలుస్తోంది. కేవ‌లం కుల నేత తానేమీ పోరాటం చేయ‌లేద‌న్నారు. ముందుగా మోదీని ఓడించేందుకు కృషి చేస్తాన‌ని, ఆ త‌ర్వాత ప్ర‌ధాని అభ్య‌ర్థి అంశంపై చ‌ర్చ చేప‌డుతామ‌ని ఖ‌ర్గే అన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube