ఖేల్ కబడ్డీలో సత్త చాటిన ఎక్సలెంట్ స్కూల్ విద్యార్ధి

0
TMedia (Telugu News) :

టీ మీడియా,డిసెంబర్ 10,పినపాక;

పేదరికం పైగా తల్లిదండ్రులు చదువులేని నిస్సహాయులు,చదివించే సోమత లేదు ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు తన ప్రతిభను అపలేవు నిరూపించిన హర్షవర్ధన్.
ఎక్సలెంట్ భాషా హై స్కూల్ ఏడూళ్ల బయ్యారం లో 3 వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేశాడు.
దమ్మక్కపేట గ్రామానికి చెందిన బొమ్మకంటి రమేశ్-అనిత దంపతుల కుమారుడు హర్షవర్ధన్ అంతర్జాతీయ ఖేల్ కబడ్డీ లీగ్ కు అర్హత సాధించి ఔరా అనిపించాడు.
కనీస సౌకర్యాలు లేకుండానే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో నేనేమి తక్కువ కాదని సమస్యలకే సవాల్ విసిరాడు.గత నెల 27 న గోవాలో జాతీయ స్థాయి జరిగిన క్రీడల్లో ఖేల్ ఇండియా కబడ్డీ లో సత్తా చాటాడు.

అంతర్జాతీయ క్రీడలకు ఎంపిక అయ్యాడు.నేపాల్ ఈ నెల 17 నుంచి 20 వరకు జరగనున్న ఖేల్ కబడ్డీ క్రీడల్లో పాల్గొననున్నారు.
నాకు ఎక్సలెంట్ భాషా హై స్కూల్ లో ప్రతి రోజూ గేమ్స్ పీరియడ్ ఉండేది. అది మాకు ఎంతో ఉపయోగపడింది ఇప్పుడు నేను ఈ అంతర్జాతీయ ఖేల్ కబడ్డీ లీగ్ కు ఎంపిక అయ్యాను అంటే మా ఉపాధ్యాయుల ప్రోత్స హం అందించిన మా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతర్జాతీయ ఖేల్ కబడ్డీ లీగ్ కు ఎంపిక అయినందున ఎక్స్ లెంట్ పాఠశాల కరస్పాండెంట్ ,యూసఫ్ షరీఫ్ , డైరెక్టర్స్ ఖాదర్ , యాకూబ్ షరీఫ్ , నర్సారెడ్డి , బండారు నరేంద్ర ,ప్రిన్సిపాల్ సురేష్ ఉపాధ్యాయులు అభినందించారు.

Excellent school student found dead in Khel Kabaddi.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube