టీ మీడియా,డిసెంబర్31,మధిర:
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వారి ఆర్థిక సహాయంతో పట్టణంలోనీ లడక్ బజార్ నందు ఏర్పాటు చేసుకున్న కిరణ్మయి లేడీస్ టైలరింగ్ ను పరిషత్ అధ్యక్షులు వేమవరపు వెంకటేశ్వర శర్మ ప్రారంభించటమైనది.
ఈ సందర్భంగా వెంకటేశ్వరశర్మ మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ గారికి మరియు రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వారికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ బ్రాహ్మణ పారిశ్రామికవేత్తల (బెస్ట్) పథకాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందటంలో మధిర మండలం ముందంజలో ఉండటం చాలా ఆనందదాయకం అన్నారు.
ఈ సందర్భంగా తుంగతుర్తి రుద్రాంబిక సాయి మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ రమణాచారి,సీఈఓ చంద్రమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. మధిర బ్రాహ్మణ పరిషత్ వారు ఈ పథకం విధివిధానాలు తెలుపుతూ అందించిన సహకారాలకు పరిషత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అవధానుల లక్ష్మి సుబ్రహ్మణ్య శాస్త్రి, జక్కేపల్లి మురళీ కృష్ణ, గడ్డమణుగు శ్రీనివాసరావు, కప్పగంతు పట్టాభి రామ శర్మ, హరి రవి శాస్త్రి, రాధ, వెల్లంకి రాజేశ్వర ప్రసాద్, తుంగతుర్తి మృత్యుంజయరావు, తుంగతుర్తి ఆంజనేయ శాస్త్రి పాల్గొన్నారు.