మృతుల కుటుంబాలను పరామర్శించిన కీర్తిరెడ్డి

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 1, చిట్యాల: మండలంలో ఇటీవలే మృతి చెందిన పలు కుటుంబాలను బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి చందుపట్ల కీర్తిరెడ్డి పరామర్శించారు.
మండలంలోని పాశిగడ్డతండా గ్రామానికి చెందిన భూక్య సురేష్ గత నాలుగేళ్ల క్రితం మరణించగా ఆయన భార్య వసంత గత నాలుగు రోజుల క్రితం మరణించడం తో అనాధలైన వారి నలుగురి పిల్లలను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసి వారికి భరోసా కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చి,అదే విధంగా మండల కేంద్రానికి చెందిన గువ్వల పద్మ గత 4 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శి మాచర్ల రఘు అధికార ప్రతినిధి రావుల రాకేష్, రావుల రఘు, బూత్ అధ్యక్షులు గోవర్ధన్ రాజు ఎస్టి మోర్చా జిల్లా నాయకులు శ్రీనివాస్ నాయక్, వెంకన్న, ఉపాధ్యక్షుడు గజనాల రవీందర్, పిట్టల రవి, గోల్కొండ సతీష్ , తదితరులు పాల్గొన్నారు.

Kirti Reddy visits families of deceased.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube