మాజీ ఎమ్మెల్యే విగ్రహం ఏర్పాటు చేయాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 15 వనపర్తి : మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు జయరాములు విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన సమాధి దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు దర్శించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు శివసేనరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, పాండు సాగర్, ఉమ్మల రాములు, రాములు, మహేష్, మర్రికుంట వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివసేన రెడ్డి మాట్లాడుతూ ఒక పేద బలహీన వర్గాల ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చేసిన సేవలను ప్రజలకు ఆయన చేసిన మేలు అలాగే కార్యకర్తలకు ఆయన చూపిన దారి చాలా గొప్పది అని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ జయరాములు సాదాసీదాగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి కూడా సరాసరిగా పేద ఇంటికి వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకొని వారికి అండగా నిలిచారని కార్యకర్తలను తన వెంట ఉండే వారిని కూడా తిన్నావా లేదా అని పలకరిస్తూ వారికి తిండి పెట్టే వారిని తనతో పాటు చూసుకునేవాడిని కార్యకర్తలను బలోపేతం చేసి తాను మాత్రం సాదాసీదాగా ఉండేవాడని ఆయన 35 సంవత్సరాలు అయినా కూడా ఆయన సమాధిని ఎవరు పట్టించుకోలేదని ఆయనలా సాదాసీదాగా ఉందని ఆయన కోరుకున్నట్టుగానే ఉందని చెప్పారు.

సతీష్ యాదవ్ మాట్లాడుతూ జయరాములు చనిపోయి 30 సంవత్సరాలు అయినా ఆయనను ఆయన సమాధిని పట్టించుకునే నాయకుడు లేకుండా పోయారని ఆయనతో డబ్బులు ఉంటే ఆయన అగ్రకులంలో ఉండి ఉంటే బాగా చూసుకునే వారని కాంగ్రెస్ పార్టీలోని మరి ఇతర ఎమ్మెల్యేలు గానీ తన తోటి ఎమ్మెల్యే సమాధి రోడ్డు పక్కన అనాధ గా ఉంటే దాన్ని బాగు పరచాలని గాని ఆయన విగ్రహం పెట్టాలని గాని ఆలోచించలేదని వారి వారి బాగోగులు చూసుకునే వాళ్లే తప్ప నాయకులను కార్యకర్తలను పట్టించుకునే అలవాటు లేని నాయకుడిగా తయారయ్యారు. కనుక పై నాయకులందరూ జయరాములు విగ్రహం కచ్చితంగా పెట్టాలని రోడ్డు వెడల్పు ఆయన సమాధి ఎలాంటి విఘాతం కలగకుండా పక్కనే ఉన్న స్థలాన్ని పరిశీలన చేసి మార్చాలని కోరుతూ పక్కన ఉన్న స్థలాన్ని పరిశీలించారు. మున్సిపాలిటీలో తీర్మానం చేసి ఆయన విగ్రహం పెట్టకపోతే శివసేన రెడ్డి నేనే పెడతానని ముందుకు వస్తాను అన్నారు. నేను సమాధి కూడా సుందరీకరణ చేస్తానని మాట ఇచ్చాడు. త్వరలో దీనిపై కమిటీ వేసి ముందుకు వెళ్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Former MLA Kirtiseshu went to his grave demanding a statue of Jayaram and congress leaders visited him and laid flowers.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube