సాయి గణేశ్ కుటుంబానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శ

సాయి గణేశ్ కుటుంబానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శ

1
TMedia (Telugu News) :

సాయి గణేశ్ కుటుంబానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శ

టీ మీడియా, ఏప్రిల్ 23, ఖమ్మం: ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ కుటుంబాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. సాయిగణేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు .ఆత్మహత్య గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు . బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Also Read : ప్రతీకారం తీర్చుకుంటాం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ యువ కార్యకర్తను కోల్పోయిందని అవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది. మరో పార్టీ ఎదగకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారు . ఖమ్మంలో మంత్రి ఆగడాలు హద్దుమీరుతున్నాయి . సాయిగణేశ్ ను అనేక రకాలుగా వేధింపులకు గురిచేశారు. అతడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి అని కిషన్ రెడ్డి అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube