వేడి తట్టుకోలేకపోతున్నా
-ఫిర్యాదు చేసిన సింగర్ కేకే
టి మీడియా, జూన్1,కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ సంగీత విభావరిలో పాల్గొన్న ప్రఖ్యాత గాయకుడు కేకే(కృష్ణకుమార్ కున్నత్) అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సంగీత కచేరి నిర్వహిస్తున్న ఆడిటోరియంలో విపరీతమైన వేడి ఉన్నట్లు ఆ సింగర్ ఫిర్యాదు చేసినట్లు కొన్ని వీడియోల ద్వారా తెలుస్తోంది. కిక్కిరిసిన ఆడిటోరియంలో చాలా హీట్ వెదర్ ఉన్నట్లు గుర్తించారు. పాట పాడుతూ మధ్యలోనే వేడిగా ఉన్నట్లు కేసీ ఫిర్యాదు చేయడంతో ఆయన్ను అక్కడ ఉన్న బాడీగార్డ్లు ఆ వేదిక నుంచి బయటకు తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి.నజ్రుల్ మంచ్ ఈవెంట్లో పాటలు పాడుతున్న కేకే సడెన్‌గా వేడిగా ఉన్నట్లు చెప్పడంతో ఆయన్ను ఆడిటోరియం నుంచి హోటల్కుతరలించారు. అక్కడే సింగర్ కేకే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆయన్ను సీఎంఆర్ఐ హాస్పిటల్కుతీసుకువెళ్లారు.
Also Read : దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
కానీ అప్పటికే కేకే మరణించినట్లు డాక్టర్లు ద్రువీకరించారు.మ్యూజిక్ షో జరిగిన ఆడిటోరియంలో సుమారు 2500 మంది కూర్చునే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ ఈవెంట్‌కు దాదాపు 5వేల మంది హాజరైనట్లు తెలస్తోంది. ఈవెంట్‌ను సరైన రీతిలో నిర్వహించలేదని ఆ రాష్ట్ర బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ ఆరోపించారు. పెద్ద పెద్ద ఈవెంట్లలో నిర్వహణ లోపిస్తుందని, కానీ సెలబ్రిటీలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అవుతుందని ఆయన అన్నారు. ఇంత వేడి వాతావరణంలో ఆడిటోరియంలో ఏసీ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి దేనిమీద పట్టింపులేదని, చాలా ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని దిలీప్ ఆరోపించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube