కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బాబర్ ఆజమ్
టి మీడియా,జూన్9,న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజమ్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించిన బాబర్ .. కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. వన్డేల్లో సారథ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం 13 ఇన్నింగ్స్‌లోనూ వెయ్యి పరుగులు మైలురాయిని దాటాడు.
Also Read : దేశంలో 7 వేలు దాటిన రోజువారీ కరోనా కేసులు
గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కెప్టెన్‌గా కోహ్లీ వెయ్యి రన్స్ చేసేందుకు 17 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. బాబర్ సాధించిన ఘనతను కీర్తిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్టు చేసింది. డివిలీర్స్ 18, విలియమ్సన్ 20, అలిస్టర్ కుక్ 21 ఇన్నింగ్స్‌లో వెయ్యి రన్స్ చేశారు. ప్రస్తుతం బాబర్ ఆజమ్ టీ20లు, వన్డేల్లో ఫస్ట్ ర్యాంక్‌లో ఉన్నారముల్తాన్లో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ 107 బంతుల్లో 103 రన్స్ చేశాడు. విండీస్ విసిరిన 306 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు ఉండగా పాకిస్థాన్ ఆ టార్గెట్‌ను అందుకున్నది. పాక్ ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హక్ 65, రిజ్వాన్ 59 రన్స్ చేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube