19న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..

వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

0
TMedia (Telugu News) :

19న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..

– వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

– టీటీడీ

లహరి, డిసెంబర్ 16, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా 19న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నందున ఆ రోజు వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా 18న సిఫారసు లేఖలు స్వీకరించబోమని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి 12.34 గంటలకు ధనుర్మాసం ప్రారంభం కానున్నందున టీటీడీ స్థానిక ఆలయాల్లో ఈ నెల 17 నుంచి జనవరి 14 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ధర్మప్రచారంలో భాగంగా వేద సారాన్ని ప్రజలకు తెలిపేందుకు 2024, ఫిబ్రవరి మొదటి వారంలో సహస్రపురుష వేదస్వస్తి చతుర్వేద పారాయణం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో సదాభార్గవి అధికారులను ఆదేశించారు.

Also Read : సీడ్ పేరుతో భాడా ఫ్రాడ్

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube