సీపీఎం కార్యదర్శిగా కొమరం కాంతారావు ఎన్నిక

0
TMedia (Telugu News) :

టీ మీడియా,నవంబర్28,కరకగూడెం;

అదివారం మండల కేంద్రమైన కరకగూడెం మండల సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాసని ఐలయ్య అధ్యక్షతన నిర్వహించిన మండల సభ సమావేశంలో తాటిగూడెం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ కారుడు కొమరం కాంతారావు ను కరకగూడెం మండల కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ… గిరిజనుల హక్కుల పరిరక్షణకు సీపీఎం పార్టీ ఎప్పుడు అందుబాటలో ఉంటుందని అన్నారు.
అటవీ హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు జరిగే విధంగా ప్రభుత్వం చూడాలన్నారు.
పార్టీ బలోపేతానికి మండల కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.మండల పదవి భాద్యతలు అప్పగించినందుకు జిల్లా,రాష్ట్ర కార్యదర్శి వర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube