ఇంటింటికి బొట్టు పెట్టి ఓటడిగిన సుధారాణి

0
TMedia (Telugu News) :

మద్దతు తెలిపిన ఏ ఎన్ ఎస్, ఏ ఎస్పీ ఆదివాసీ సంఘాలు
టి మీడియా, డిసెంబర్ 7, వెంకటాపురం :

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదివాసీ ఆడబిడ్డ కోండ్రు సుధారాణి మంగళవారం వెంకటాపురం, వాజేడు మండలాల్లో పర్యటించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సుధారాణితో పాటు ఏ ఎన్ ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొర్శా నర్సింహమూర్తి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు, ఏ ఎస్పీ నాయకులు పూనేం రామచందర్, నూపా నాగేశ్వర్ రావు, పూనేం చంటి కలిసి జడ్పీటీసీ పాయం రమణ, ఎంపీటీసీ సభ్యుల ఇంటింటికి తిరుగుతూ ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టి, మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేయమని అభ్యర్ధించించారు. ఇంట్లో ఎంపీటీసీ సభ్యులు లేకున్నా వాళ్ళ ఇంటికెళ్లి ఇంట్లో ఎవరున్నా వారికి బొట్టు పెట్టి చరవాణి ద్వారా ఎంపీటీసీలతో మాట్లాడి ఓటు అడిగారు. ఆదివాసీ హక్కులు, చట్టాల అమలుకు నోచుకోవడం లేదని తనకు ఓటు వేసి శాసన మండలికి పంపిస్తే ప్రభుత్వంతో పోరాటం చేసి ఆదివాసీ చట్టాలు అమలు అయ్యేవిధంగా కృషి చేస్తానని అభ్యర్థి కోండ్రు సుధారాణి తెలియజేసారు.

ముఖ్యమంత్రి కెసీర్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను అపహరించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని ఆమే అన్నారు. ఆదివాసీల గొంతు నొక్కడానికే ఆదివాసీ ప్రజాప్రతినిధులను పక్క రాష్ట్రాల్లో దాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని , దీన్ని ప్రశ్నించలేని స్థితిలో ప్రతిపక్ష , వామపక్ష పార్టీలు ఉన్నాయని. ప్రజాస్వామిక వాదులు, మేధావులు ప్రజా క్షేత్రంలోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని కోరారు. ఆదివాసీ ప్రజాప్రతినిధులు అంతా తనకి మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి ఆదివాసీల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సంఘాల మద్దతు
శాసన మండలి సభ్యురాలు కోండ్రు సుధారాణి కి ఆదివాసీ నవ నిర్మాణ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కొర్శా నర్సింహమూర్తి , ఏఎస్పీ నాయకులు పూనేం రామచందర్, పూనేం చంటి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube