టీ మీడియా డిసెంబర్ 16: కొణిజర్ల
మండల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడంతో రైతులులొ నిరసన వ్యక్తమవుతోంది. కొణిజర్ల సర్పంచ్ సూరంపల్లి రామారావు ఆధ్వర్యంలో ని రైతులు మండల తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తాసిల్దార్ కి మెమోరాండం అందజేశారు ఈ సమస్యపై వివరించారు.ఈ సందర్భంగా సూరంపల్లి రామారావు మాట్లాడుతూ మేజర్ గ్రామ పంచాయతీ అయిన కొణిజర్లలో ఎంతో మంది రైతులు కల్లాలలో తమ ధాన్యాల పోసుకుని. కొనే దిక్కులేక దళారులకు అమ్ముకుని మోసపోతున్నారు అని అన్నారు. మేజర్ గ్రామ పంచాయతీలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకుండా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అలాగే ఖాళీ సంచులు సరఫరాలో కూడా అధికార పార్టీ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున వారికి ఇస్తున్నారు అని విమర్శించారు.
కావున కొణిజర్ల తాసిల్దారు ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ఏర్పాటు అయ్యేటట్లు చూడాలని కోరారు .ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ నెల్లూరు రమేష్, కొణిజర్ల ఎం పి టి సి కొనకంచి స్వర్ణలత, శాంతకుమార్ ,రాయల భద్రయ్య, గుడివాడ వెంకటేశ్వర్లు ,కోడుమూరు వెంకటేశ్వర్లు ,గ్రామంలోని రైతులు పాల్గొన్నారు..
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube