బాధితులకు నష్టపరిహారం అందించాలి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 27 వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో రేవల్లి మండలం కొంకలపల్లి గ్రామస్తులు ఏదుల వీరాంజనేయస్వామి రిజర్వాయర్లో కొంకలపల్లి గ్రామం మునిగిపోతున్న అందున గ్రామస్తులతో పాటు వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ వారు అంబేద్కర్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రలతో వచ్చి అడిషనల్ కలెక్టర్కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనరెడ్డి మాట్లాడుతూ వారికి తగిన నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, పీసీసీ సభ్యులు శ్రీనివాస్గౌడ్ ,వనపర్తి పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాండు సాగర్, భాస్కర్, వాల్యనాయక్, చంద్రమౌళి, రణధీర్, మేకల అశోక్, యాదగిరి నాయుడు, శివ, రాజు పెద్దగూడెం రమేష్ మాజీ సర్పంచ్ కొండన్న బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube