మెడిసిన్ సీటు సాధించిన కొప్పునూరు విద్యార్థిని

మెడిసిన్ సీటు సాధించిన కొప్పునూరు విద్యార్థిని

1
TMedia (Telugu News) :

మెడిసిన్ సీటు సాధించిన కొప్పునూరు విద్యార్థిని

టీ మీడియా, సెప్టెంబర్ 14 ,చిన్నంబావి:

చిన్నంబావి మండలం కొప్పునూరు గ్రామ వాస్తవ్యులైన బండారి శ్రీనివాస్ విద్యావత్తుల కూతురు శ్రీ వల్లిక నీటు పరీక్షలో 527 మార్కులు సాధించి మెడికల్ ఎంబీబీఎస్ సీటు సాధించబోతున్నందుకు ఆ శుభ సందర్భం పురస్కరించుకొని చిన్నంబావి మండల జడ్పిటిసి కేసిరెడ్డి వెంకట్రామమ్మ చిన్నారెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎంపీపీ సుధారాణి,పెబ్బేర్ జెడ్పిటిసి పద్మా వెంకటేష్, వనపర్తి పట్టణంలో నివసిస్తున్న బండారి శ్రీనివాసులు నివాసానికి వెళ్లి కూతురు శ్రీ వల్లిక బండారు శ్రీను విద్యావతులను ఘనంగా సన్మానించి భవిష్యత్తులో ప్రజలకు సేవ చేసే అదృష్టం రాబోతున్నందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించి పుష్పగుచుము బహుకరించి స్వీట్లు పంచడం జరిగినది.

Also Read : కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఈ సందర్భంగా జడ్పిటిసి గారు మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేదలు హెచ్ ఐ వి వ్యాధిగ్రస్తులు బాధితులకు వనపర్తి ప్రభుత్వ హాస్పిటల్ లో వారికి సేవలందించి వారికి ధైర్యాన్ని నూరు పోస్తున్న బండారు శ్రీనివాసులు అభినందనలు వారి సేవలకు వారి కూతురు మెడిసిన్ లో సీటు రావడం హర్షించదగ్గ విషయమని తండ్రి బాటలో కూతురు కూడా భవిష్యత్తులో ప్రజా సేవ చేసే అవకాశం వస్తున్నందుకు చాలా సంతోషకరమైన విషయమని కొప్పునూరు ఆడపడుచు గా ఒక జడ్పిటిసిగా కొల్లాపూర్ మాజీ ఎంపీపీ ఒక కొప్పునూరు ఆడపడుచు గా నేడు శ్రీ వల్లిక కొప్పునూరు ఆడపడుచు గా పుట్టిన గ్రామానికి మంచి పేరు తేవాలని ఆ విద్యార్థినిని దీవిస్తూ వారి తల్లిదండ్రులను అభినందిస్తూ భవిష్యత్తులో వారి కి అన్ని రకాలు గా చేదోడు వాదోడు గా అండ గా ఉంటామని ప్రతి విద్యార్థి నీ ప్రతి తల్లిదండ్రులు శ్రీ వల్లిక లాగే చదివి శ్రీ వల్లికను ప్రోత్సహించినట్టుగానే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహిస్తూ పిల్లల భవిష్యత్తును బంగారు మయం చేస్తే జీవితంలో అంతకన్నా ఏముంటుందని ఈ సందర్భం గా జడ్పిటిసి ప్రశంసించినారు ఇట్టి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు ఆంధ్ర ప్రభ రిపోర్టర్ యుగంధర్, కరెంట్ లైన్ మెన్ సురేందర్, దగడపల్లి ఉపసర్పంచ్ గంగాధర్ యాదవ్, కాలూరు గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube