ముంబయిలో కొరియన్ యువతిని వేధింపులకు గురిచేసిన యువకులు
ముంబయిలో కొరియన్ యువతిని వేధింపులకు గురిచేసిన యువకులు
ముంబయిలో కొరియన్ యువతిని వేధింపులకు గురిచేసిన యువకులు..
టీ మీడియా,డిసెంబర్ 1,ముంబయి : సౌత్ కొరియాకు చెందిన ఓ మహిళా యూట్యూబర్‌ను ఇద్దరు యువకులు వేధింపులకు గురి చేశారు. నడిరోడ్డుపై యువతి చేయి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. మంగళవారం రాత్రి ముంబయిలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత యువతి లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా అక్కడికి వచ్చిన ఆకతాయిలు ఆమె చేయి పట్టుకుని బైక్ వద్దకు లాక్కెళ్లారు. ఆమె ‘నో.. నో.. నో’ అని అరుస్తున్నా పట్టించుకోలేదు. యువతి ప్రతిఘటిస్తున్నా వదలని యువకుడు ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేశాడు.
Also Read : ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయండి
వారు లిఫ్ట్ ఇస్తామని చెప్పగా నిరాకరించిన ఆమె.. తన ఇల్లు సమీపంలోనే ఉందని తెలిపింది. అనంతరం వారి నుంచి తప్పించుకుని వచ్చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.