రికార్డు స్థాయిలో కోటప్పకొండ తిరునాళ్లు హుండీలు..
లహరి, ఫిబ్రవరి 20, పల్నాడు : కోటప్పకొండ అనగానే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది తిరునాళ్లు, ప్రభలు. రంగురంగుల విద్యుత్ దీప కాంతుల్లో.. అశేష భక్త జన సందోహం మధ్య జరిగే కోటయ్య ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా చుట్టుపక్కలా రాష్ట్రంలోనూ చాలా ఫేమస్. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కోటప్పకొండ శివ నామ స్మరణతో మార్మోగింది. భక్తుల రాకతో త్రికూట పర్వతం సందడిగా మారింది. పంచాక్షరి మంత్రంతో భక్తులు తన్మయత్వం పొందారు.
ఇష్టదైవానికి మొక్కులు చెల్లించుకున్నారు. కోటప్పకొండలో నిర్వహించిన శనివారం తిరునాళ్ల మహోత్సవంలో భక్తులు వివిధ రూపాల్లో రూ. కోటి 73లక్షల 67వేల 386 ఆదాయం త్రికోటేశ్వరునికి సమర్పించారు. వివిధ రకాల పూజ టిక్కెట్ల ద్వారా రూ.65,01,240, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 35,00,025 వచ్చింది. అన్నదానం కానుకల ద్వారా రూ.1,21,321, హుండీల కానుకల ద్వారా రూ.72,44,803 ఆదాయం వచ్చినట్లు ఆలయాధికారి వేమూరి గోపి తెలిపారు. గతేడాది ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది రూ.4,30,519 ఆదాయం అదనంగా వచ్చింది. తిరునాళ్లలో చివరి ఘట్టంగా లింగోద్భవ కాలంలో శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జాగారం చేశారు.
Also Read : 21 నుంచి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలు
ప్రత్యేక పూజలు, అభిషేక మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ క్షేత్రంలో ఆనందవల్లిని దర్శించుకున్న తర్వాతే స్వామి వారిని దర్శించుకుంటారు. గ్రామాలు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోటప్పకొండకు ప్రభలు కట్టుకుని వెళతారు. ప్రభల విషయంలో గ్రామాల మధ్య పోటీ కూడా ఉంటుంది. ఈ ప్రభలపై ఏర్పాటు చేసే ప్రోగ్రామ్స్ ను చూస్తూ భక్తులు జాగారం చేస్తారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube